Mana Badi Nadu-Nedu Program: అందరూ చదువుకునేందుకు ‘మన బడి’కి రండి
ఆ లక్ష్యంతోనే పిల్లలను బడికి పంపితే చాలు ప్రభుత్వమే వారి చదువుకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ఉచింతంగా ఇస్తోంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, ఆయా ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమీడియంతో పాటు సీబీఎస్‌ఈని కూడా అమలు చేయనున్నారు.
ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభించిన తొలిరోజునే విద్యాకానుక అందించేందుకు అధికార యంత్రాంగం సర్వ సిద్ధం చేసింది. ఇదంతా పిల్లలను బడికి పంపితే కలిగే ప్రయోజనం. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. మనబడికి రండి అంటూ ఉపాధ్యాయులు సాగిస్తున్న ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది.
పది అంశాలపై వివరణ..
మన బడికి రండి కార్యక్రమంలో భాగంగా ప్రచారం సాగిస్తున్న ఉపాధ్యాయులు పది అంశాలను తెలియజేస్తున్నారు. నాడు–నేడు పథకం ద్వారా పాఠశాల ఎలా తయారైందో తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉందని చెబుతున్నారు. నూతన విద్యావిధానం ద్వారా ఒత్తిడిలేని బోధన ఉంటుందని చెబుతున్నారు.
Mana Ooru Mana Badi: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు శ్రీకారం.. మన ఊరు మన బడి పథకం అమలుతో..!
అలాగే క్వాలిఫైడ్ టీచర్లు అందుబాటులో ఉంటారని, విద్యాకానుక పథకం కింద పిల్లలకు ఉచితంగా యూనిఫాం, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, బ్యాగులు తదితర సామగ్రి అందిస్తున్నామని వివరిస్తున్నారు. మధ్యాహ్నం నాణ్యమైన భోజనం ఉంటుందని, బడికి పంపే తల్లుల ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు నగదు జమకానుందని తెలియజేస్తున్నారు.
పైసా ఖర్చు లేకుండా సొంత ఊరిలోనే పిల్లలకు ఉత్తమ విద్యను అందిచవచ్చునని పిలుపునిస్తున్నారు. ఈ మాటలు తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా అడ్మిషన్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Education News: విద్యార్థుల భవితను తీర్చిదిద్దే ఆలోచన.. జెడ్పీ హైస్కూల్లో వలంటీర్ వ్యవస్థ
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య..
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యతో పాటు ఉన్నత విలువలు, సంస్కారం, సంప్రదాయాలు నేర్పుతున్నారు.ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. కార్పోరేట్‌కు దీటుగా ఉత్తమ విద్య బోధిస్తున్నాం. బడి ఈడు వయసున్న పిల్లలందరూ బడిలోనే ఉండాలి. – ఎన్.ప్రేమ్‌కుమార్, డీఈఓ, విజయనగరం