Skip to main content

First Class Admissions Confusion : 1వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌పై త‌ల్లిదండ్రుల అయోమ‌యం.. ఎన్ఈపీ 2020 నిబంధ‌న ప్ర‌కారం..

స్టేట్‌, సెంట్ర‌ల్ సిల‌బ‌స్ ఉన్న స్పూళ్ల‌లో ఒక‌ట‌వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు క‌నీస వ‌య‌సు 6ఏళ్లు.
Confusion in parents with 1st class admissions and age difference

సాక్షి ఎడ్యుకేష‌న్: స్టేట్‌, సెంట్ర‌ల్ సిల‌బ‌స్ ఉన్న స్పూళ్ల‌లో ఒక‌ట‌వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు క‌నీస వ‌య‌సు 6ఏళ్లు. చిన్నారుల‌కు ఆరేళ్లు నిండిన త‌రువాతే పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశం ఉంటుంద‌ని కేంద్రం అప్పుడే ఆదేశాల‌ను జారీ చేసింది. కాని, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్ప‌టికీ, ఐదేళ్లు వచ్చిన విద్యార్థుల‌కు 1వ త‌ర‌గ‌తిలో సీటు ఇస్తున్నారు. కొన్ని పాఠ‌శాలల్లో 6 ఏళ్లు వ‌చ్చిన త‌రువాత ప్ర‌వేశం ఇస్తున్నారు. దీంతో, త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కొంది. మేనేజ్మెంట్ కూడా కన్ఫ్యూజ‌న్‌లో తేలుతుంది.

ఎన్ఈపీ-2020 ప్ర‌కారం..

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా, ప్ర‌తీ ఏటా ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఒక‌టో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశం పొందుతున్నారు. అయితే, ఈసారి త‌ల్లిదండ్రుల‌కు విద్యార్థుల వ‌య‌సుపై క్లారిటీ రావ‌డంలేదు. ఏ వ‌య‌సులో పిల్ల‌ల్ని పాఠ‌శాల‌లో చేర్పించాలి అనే విషయంపై ఇంకా ఆందోళ‌న నెల‌కొంది. కొన్ని విద్యాల‌యాల్లో 5 ఏళ్ల‌కు మ‌రికొన్ని 6 ఏళ్ల‌కు అని ప్ర‌వేశాలు ఇస్తున్నారు. కాని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ-2020 ప్ర‌కారం.. 2024-25 నుంచే ఒకటో తరగతిలో అడ్మిషన్ కోసం ఆరేండ్లు నిండి ఉండాలని నిర్ణ‌యించింది కేంద్ర ప్ర‌భుత్వం.

Free training in computer courses: కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ

కానీ, ఎన్ఈపీని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అడాప్ట్ చేసుకోకపోవడంతో.. ఏజ్ లిమిట్​పై స్పష్టత కరువైంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర సిలబస్​తో నడుస్తున్న ప్రైవేట్​ స్కూళ్లు.. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నాయి. మ‌రి, కొన్ని స్కూళ్లు డిసెంబర్ వరకూ, కొన్ని బడులు మే వరకూ ఏజ్ కటాఫ్ పెట్టుకున్నాయి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని సర్కారు స్కూళ్లలో ఐదేండ్లు నిండిన వారికి అడ్మిషన్లు ఇస్తున్నారు. అయితే, స్టేట్ సిలబస్ అమలు చేస్తున్న ప్రైవేట్​ బడుల్లో మాత్రం అయోమయమే కంటిన్యూ అవుతోంది.

ఏజ్ లేదు..

రాష్ట్ర ప్ర‌భుత్వంలో 6 ఏళ్ల‌కు 1వ తరగతి పూర్తి చేసుకున్న‌ చిన్నారుల‌ని, మ‌రో త‌ర‌గ‌తికి మార్చాలని, సీబీఎస్ఈ సిలబస్ స్కూళ్లలో అడ్మిషన్లకు వెళ్తే అక్క‌డ‌ ఏజ్ లేదని.. మ‌రోసారి ఒకటో తరగతిలోనే చేరాలని చెబుతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఈపీ ప్రకారం 3 నుంచి 8 ఏళ్ల‌ వరకు తొలి మూడేండ్ల ప్రీ స్కూల్, తర్వాత 2 ఏళ్లు 1వ త‌ర‌గ‌తి, 2వ త‌ర‌గ‌తి పూర్తి చేయాలన్న నిబంధన ఉంది. ఈ మెర‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే కేంద్రం ప‌లుసార్లు లేఖ‌లు రాసింది.

High Court of Telangana: హైకోర్టులో ముగ్గురు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా

ఎన్ఈపీ నిబంధ‌న అమలు చేయాలి..

ఇక‌, వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం.. 2025-26 నుంచి జరిగే ప్ర‌వేశాల‌పై స‌ర్కార్‌ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు త‌ల్లిదండ్ర‌లు. ఇక్క‌డ‌, 1వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌పై స్ప‌ష్ట‌త కరువైందని, ఎన్ఈపీ ని రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకోకపోవడంతోనే ఈ సమస్య ఎదురవుతోందని ఓ విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలోనే ఎడ్యుకేషన్ పై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీకి లేఖ రాస్తామని ఆయన వెల్లడించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 15 Feb 2025 12:52PM

Photo Stories