Skip to main content

Free Education Schools : ఈ స్కూల్స్‌లో సీటు వ‌స్తే... ఇంట‌ర్‌ వరకు అంతా ఫ్రీ...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌స్తుత రోజుల్లో విద్య, వైద్యం ఖ‌రీదు అయిన విష‌యం తెల్సిందే. ఎంతో మంది పేద‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు త‌మ బిడ్డ‌ల‌కు ఉన్న‌త చ‌దువులు చ‌దివించాల‌ని కోరిక ఉంటుంది.
Free Education  Telangana Model Schools admission notification 2025-26  Admissions open for Class 6 to 10 in Telangana Model Schools  Apply for Telangana Model Schools admission before March 10, 2025  Telangana Model Schools online application process

కానీ ఆర్థిక ప‌రిస్థితుల కార‌ణంగా... వెన‌క‌డుగు వేస్తుంటారు. అయితే... తెలంగాణ గ్రామీణ‌ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అదించేందుకు ప్ర‌భుత్వం ఆదర్శ పాఠశాలలు తీసుకొచ్చింది. 

ఈ పాఠ‌శాల‌ల్లో 2025-26 ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్‌...
ఈ ఆదర్శ పాఠ‌శాల‌ల్లో 2025-26 అకడమిక్ ఇయర్ కోసం 6వ త‌ర‌గ‌తి నుంచి 10 తరగతుల వ‌ర‌కు ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. అడ్మిషన్ కోసం  ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు మార్చి 10వ తేదీ వరకు గడువు ఇచ్చారు. https:///telanganams.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

ఇంటర్ వరకు అంతా ఫ్రీ... 
ఈ పాఠ‌శాల‌ల్లో అడ్మిషన్ దొరికితే ఇంటర్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగానే అందిస్తారు. బాలికలకు అయితే హాస్టల్ సదుపాయం కూడా ఇస్తారు. 

అర్హ‌త‌లు ఇవే..
గవర్నమెంట్ నోటిఫై చేసిన స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. 

ద‌ర‌ఖాస్తు ఫీజు :
ఓసీ విద్యార్థులు రూ.200/- చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అలాగే BC, SC, ST, EWS, PHC కేటగిరీలకు చెందిన విద్యార్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 125/- చెల్లించాలి.

ప‌రీక్ష వివ‌రాలు ఇవే..
ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి హాల్‌ టికెట్ల‌ల‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్ 13వ తేదీ దరఖాస్తు చేసిన స్కూల్‌లోనే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఉదయం 10-12 వరకు 6వ తరగతి, మధ్యాహ్నం 2-4 వరకు 7-10 తరగతుల వారికి ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు.

Published date : 27 Feb 2025 03:05PM

Photo Stories