Coaching for Teachers: ముగిసిన క్రియేటివ్ ఈ– కంటెంట్ జనరేషన్ శిక్షణ
కంబాలచెరువు: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఆంధ్ర రాష్ట్ర కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు రోజులుగా రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు నిర్వహిస్తున్న క్రియేటివ్ ఈ– కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. దీనికి కళాశాల ఆర్జేడీ డాక్టర్ చప్పిడి కృష్ణ హాజరై మాట్లాడుతూ ఉన్నత విద్య బోధనా విధానంలో వస్తున్న పెను మార్పులను కళాశాలల అధ్యాపకులు ఆకళింపు చేసుకోవాలన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించి పాఠ్య ప్రణాళిక రూపొందించి, తదనుగుణంగా విద్యా బోధన సాగించాలన్నారు.
ITI Admissions: ప్రభుత్వ, ప్రవైటు ఐటీఐ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు..
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర.ఆర్‌కే మాట్లాడుతూ డిజిటల్ పద్ధతులను అధ్యాపకులు తమ విద్యా బోధనలో ప్రవేశ పెట్టాలన్నారు. ఉన్నత విద్యలో నిన్న, నేడు, రేపు అనే ప్రాతిపదికన వస్తున్న మార్పులను తెలుసుకోవాలన్నారు. ఈ పద్ధతులను ఏఐతో అనుసంధానించి విద్యా బోధన సాగించడంలో ఆర్ట్స్ కళాశాల ముందంజలో ఉందన్నారు. కృత్రిమ మేధ పద్ధతుల్లో ప్రవీణుడు డాక్టర్ సునీల్ మ్యాజిక్ స్కూల్ వంటి సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి పాఠ్య ప్రణాళికను ఎలా రూపొందించాలో వివరించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ నాగేంద్ర పలు అంశాలు వివరించారు. శిక్షణకు బి.వెంకట్రావు సమన్వయకర్తగా, ఏపీసీసీఈకు చెందిన డాక్టర్ జె.జ్యోతి పర్యవేక్షకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎన్.శ్రీనివాస్, సంజీవ్ కుమార్, కిరణ్ కుమార్, ప్రవీణ్ అధ్యాపకులు పాల్గొన్నారు.
Gurukul Students in EAPCET: ఈఏపీ సెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన బాలుర గురుకుల విద్యార్థులు..