Eklavya Schools: ఏకలవ్య పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
2024 మార్చిలో సీబీఎస్‌ఈ సబ్జెక్టుల్లో 10వ తరగతి, ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
వై.రామవరం మండలం పి.ఎర్రగొండ ఏకలవ్య పాఠశాలలో 13 మంది బాలికలకు, మారేడుమిల్లి ఏకలవ్యలో 18 మంది బాలికలకు, 16 మంది బాలురకు, రాజవొమ్మంగి ఏకలవ్యలో 15 మంది బాలికలు, 16 మంది బాలురు, చింతూరు ఏకలవ్యలో 16 మంది బాలికలు, 16 మంది బాలురకు, మొత్తం 48 సీట్లు బాలురకు, 62 సీట్లు బాలికలకు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9490876026 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
ITI Admissions: ప్రభుత్వ, ప్రవైటు ఐటీఐ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు..
జి.మాడుగుల: ఏకలవ్య కళాశాలలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పారయ్య సూచించారు. గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంచలేదని ఆయన పేర్కొన్నారు.