Polytechnic College: ఉద్యోగావకాశాలకు నిలయంగా పాలిటెక్నిక్ కళాశాల
నంద్యాల: ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. హుసేనాపురం (కొమ్మేమర్రి) గ్రామంలో ఏర్పాటు చేసిన ఎనిమల్ హజ్బెండజరి పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగావకాశాలకు నిలయంగా మారింది. 2021 ఫిబ్రవరిలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. హుసేనాపురం రూ.11.11కోట్లతో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల భవనం, బాల బాలికలకు వేర్వేరు వసతి గృహాలను ప్రభుత్వం నిర్మించింది.
Summer Camp: పోషకాహారలోపం నిర్మూలనకు రాగి లడ్డూల పంపిణీ
ప్రస్తుతానికి హుసేనాపురం ఉన్నత పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించే బ్యాచ్‌తో కొత్త భవనాల్లోకి కళాశాలను తరలిస్తారు. సువిశాలమైన కళాశాల భవనం, వసతి గృహాలతో విద్యార్థులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ల పాటు కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు భవిష్యత్తులో సునాయసంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంది. గత రెండు సంవత్సరాల్లో ఇక్కడ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులందరూ సచివాలయాలు, ఆర్బీకేల్లో వెటర్నరీ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు సాధించారు. ఏటా 35 మంది విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ పొందవచ్చు. ప్రథమ సంవత్సరంలో 35 మంది, ద్వితీయ సంవత్సరంలో 35 మంది చొప్పున విద్యార్థులు ఉంటారు. వీరికి నాలుగు సెమిస్టర్లలో పౌల్ట్రీ, అనాటమి, ఫిజియాలజీ మీట్, లైవ్‌స్టాక్ మేనేజ్‌మెంట్, జూ అనిమల్స్, డెయిరీ అనిమల్స్ మేనేజ్‌మెంట్ వంటి 18 రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి.
Coaching for Teachers: ముగిసిన క్రియేటివ్ ఈ– కంటెంట్ జనరేషన్ శిక్షణ
సెమిస్టర్‌కు ఆరు కోర్సులు చొప్పున ఉంటాయి. మూడు సెమిస్టర్లు కళాశాలలో కాగా నాలుగో సెమిస్టర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రాం ఉంటుంది. ఇది వంద రోజుల పాటు సమీపంలోని వెటర్నరీ, ప్రయోగశాలల్లో, ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వైవాలో వైవా బృందం విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి నుంచి సంతృప్తికర సమాధానాలను రాబట్టుకుంటుంది. సమాధానాలను పరిశీలించిన వైవా బృందం సంబంధిత నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది.
Free Education: ‘ప్రైవేటు’లో ఉచిత విద్య
దరఖాస్తులు ఇలా..
ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు. రోస్టర్ విధానంలో సీట్ల భర్తీ ఉంటుంది. గత ఏడాది ఇంటర్ మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఈ కోర్సు పూర్తయిన తర్వాత నేరుగా డిగ్రీ విద్యను కొనసాగించవచ్చు. గత రెండు సంవత్సరాల్లో ఇక్కడ కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల్లో 22 మంది విద్యార్థులు సచివాలయం, ఆర్బీకేల్లో వెటర్నరి అసిస్టెంట్లుగా ఉద్యోగాలు సాధించారు.
Awareness Program for Teachers: సీబీఎస్ఈ సిలబస్‌పై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం..
సువర్ణావకాశం
పదో తరగతి ఉత్తీర్ణులైన పేద విద్యార్థులు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో అందిస్తున్న కోర్సులు సువర్ణావకాశం అనే చెప్పాలి. రాష్ట్రంలో అతి కొద్దిగా ఉన్న ఈ కళాశాలలు ప్యాపిలి మండలంలో ఏర్పాటు కావడంతో స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ఇదొక వరం.
– మాధవి, ప్రిన్సిపాల్, వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాల
Tags
- Polytechnic College
- Job Opportunity
- principal madhavi
- animal husbandary polytechnic college
- Tenth Students
- notification
- admissions
- various job offers
- Education News
- Sakshi Education News
- nandyala district news
- VocationalTraining
- RuralDevelopment
- SkillDevelopment
- JobOpportunities
- EducationPrograms
- SakshiEducationUpdates