Awareness Program for Teachers: సీబీఎస్ఈ సిలబస్‌పై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం..

పుట్టపర్తి అర్బన్: అవగాహన ఉంటే సీబీఎస్‌ఈ సిలబస్ బోధన కూడా చాలా సులువుగానే ఉంటుందని పాఠశాల విద్య ఆర్జేడీ రాఘవరెడ్డి అన్నారు. సీబీఎస్‌ఈ బోధనాంశాలపై పుట్టపర్తి మండలం జగరాజుపల్లి మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు శనివారం ముగిశాయి.
Inter Gurukul Counselling: గురుకుల ఇంటర్ కళాశాలల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్..!
సీబీఎస్‌ఈ సిలబస్ అమలుకు జిల్లాలో ఎంపిక చేసిన 49 పాఠశాలల నుంచి 113 మంది మ్యాథ్స్, సైన్స్ టీచర్లు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో ఆర్జేడీ రాఘవరెడ్డి, డీఈఓ మీనాక్షి, స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ ఇస్మాయిల్, డీవైఈఓ రంగస్వామి, జిల్లా కోఆర్డినేటర్ రమేష్‌బాబు తదితరులు పాల్గొని ఉపాధ్యాయులకు బోధనలో అనుసరించాల్సిన వివిధ పద్ధతులు వివరించారు.
Degree Admissions: 'దోస్త్'తో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు..
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రవేశ పెడుతున్నందున ఉపాధ్యాయులంతా అవగాహన పెంచుకుని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని పాఠశాల విద్య ఆర్జేడీ రాఘవరెడ్డి సూచించారు. స్టేట్ సిలబస్‌కు, సీబీఎస్‌ఈ సిలబస్‌కు తేడా ఉంటుందన్నారు. బోధనతో పాటు మూల్యాంకనం కూడా ఎంతో ముఖ్యమన్నారు. అలాగే, ఈ నెల 20, 21 తేదీల్లో ఇదే పాఠశాలలో ఇంగ్లిష్, బయాలజీ, సోషల్ సబ్జెక్టుల టీచర్లకు జిల్లా స్థాయి శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ITI Admissions: ప్రభుత్వ, ప్రవైటు ఐటీఐ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు..