Skip to main content

Inter Gurukul Counselling: గురుకుల ఇంట‌ర్‌ క‌ళాశాల‌ల్లో సీట్ల భ‌ర్తీకి కౌన్సెలింగ్‌..!

అంబేడ్కర్‌ గురుకుల కళాశాలల్లో విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ ఈ నెల 22న నిర్వ‌హిస్తున్న‌ట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ ప్ర‌క‌టించారు..
Counselling for Gurukul Intermediate College Admissions

అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్‌) గురుకుల కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌ మొదటి సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఏజీ సెట్‌–2024లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుందని పేర్కొన్నారు.

ITI Admissions: ప్ర‌భుత్వ‌, ప్ర‌వైటు ఐటీఐ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

బాలుర గురుకులాల్లోని 154 ఖాళీలు, బాలికల గురుకులాల్లోని 295 ఖాళీల భర్తీకి 1:3 నిష్పత్తిలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలురకు సంబంధించి ఎస్సీ కేటగిరీలో 22 నుంచి 7,569 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 261 నుంచి 5,730, బీసీలో 5 నుంచి 403, ఓసీ కేటగిరీలో 19 నుంచి 1,023 ర్యాంకు వరకు విద్యార్థులకు ఈ నెల 22న నార్పల మండలం బి.పప్పూరు గురుకులంలో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.

Gurukul Students in EAPCET: ఈఏపీ సెట్‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించిన బాలుర‌ గురుకుల విద్యార్థులు..

● బాలికలకు సంబంధించి ఎస్సీ కేటగిరీలో 57 నుంచి 19,371 ర్యాంకు వరకు, బీసీ(సీ) కేటగిరీలో 425 నుంచి 18,483 వరకు, ఎస్టీ 48 నుంచి 12,867, బీసీ 14 నుంచి 1,845, ఓసీ కేటగిరీలో 11 నుంచి 2,128 ర్యాంకు వరకు ఈ నెల 23న అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట గురుకులంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం తొమ్మిది గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. మెరిట్‌ కార్డు, టెన్త్‌ మార్కుల మెమో, ఆధార్‌ కార్డు, కులం, ఆదాయ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

AP EAPCET: ప్ర‌శాంతంగా ఏపీ ఈఏపీసెట్ ప‌రీక్ష‌..

Published date : 21 May 2024 11:38AM

Photo Stories