Summer Camp: పోషకాహారలోపం నిర్మూలనకు రాగి లడ్డూల పంపిణీ
![copper brownies distribution for students](/sites/default/files/images/2024/05/21/copperbrownies-1716270580.jpg)
ఒక్కో గ్రామానికి ఒక్కో టీచర్‌ను నియమించి, ఆటాపాటలతో వారిలో చదువుపై ఆసక్తి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చదువుతో పాటు డాన్స్, పేయింటింగ్, ఆర్ట్స్, క్రాప్ట్స్, వ్యాయామం, స్టోరీ టెల్లింగ్, అబాకస్, చెస్ వంటి వాటిల్లో మెళకువలు నేర్పుతున్నారు.
చెంచు చిన్నారుల్లో పోషకాహార లోపం నిర్మూలించేందుకు ఐరన్ ఎక్కువగా ఉండే రాగి లడ్డూలు, రాగి జావా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం వేళ అన్నం, పప్పు, కూరగాయలతో భోజనం అందిస్తున్నారు.
చదవండి: Private Unaided Schools: విద్యా హక్కు చట్టంతో ఉచిత విద్య.. దరఖాస్తులకు చివరి తేదీ!
నల్లమల పరిసర ప్రాంతాల్లో చిన్నారులు వేసవిలో ఎక్కువగా ఈత కోసం బావులు, చెరువుల వద్దకు వెళ్లి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వారికి చదువుపై ఆసక్తిని పెంచి, పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని కోనేరు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.