Agriculture Course: ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న వ్యవసాయం కోర్సులు..
ఉండి: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ విద్యావిధానంలో సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కృషీ విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లికార్జున గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో వ్యవసాయ విద్యావ్యాప్తికి తీసుకునే చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
Inter Examinations 2024: ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన చర్యలు.. షెడ్యూల్ ఇలా..
దీనిలో భాగంగా రైతులు, యువత, మహిళలకు ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికెట్ కోర్సులు తెలుగు మీడియంలో సేంద్రియ వ్యవసాయం, పుట్టగొడుగుల పెంపకంపై 8 వారాల శిక్షణ, ఒకరోజు ప్రాక్టికల్ ప్రోగ్రాం నిర్వహిస్తారన్నారు. ఈ తరగతులు మార్చి, ఏప్రిల్‌లో జరుగుతాయన్నారు.
Employment opportunities: గిరిజన యువతకుఉపాధి కల్పించడమే లక్ష్యం
ఆసక్తి కలిగిన వారు రూ.1,500 ఫీజు చెల్లించాలని, అభ్యర్థికి కంప్యూటర్, అండ్రాయిడ్ ఫోన్, ఐపాడ్ వంటివి కలిగి ఉండాలన్నారు. మార్చి 20వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకుని 83096 26619 నంబర్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటలలోపు సంప్రదించాలని సూచించారు.
Degree Lecturer Results: కాలు కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యంతో.. ప్రథమ స్థానం కైవసం చేసుకున్న గణేశ్