Inter Examinations 2024: ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన చర్యలు.. షెడ్యూల్ ఇలా..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 99 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్ అధికారిని ప్రభుత్వం నియమించింది. వారితో పాటుగా ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు.
AP Inter Exams: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు..
పరీక్ష పత్రాలు, పరీక్షకు సంబంధించిన ఇతర సామగ్రిని భద్రపరిచేందుకు జిల్లాలో 17 పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే ప్రశ్న పత్రాలు చేరుకున్నాయి. 29 కస్టోడియన్లను ఏర్పాటు చేసి, సుమారు 1300 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలు జరుగుతున్న అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.
Degree Lecturer Results: కాలు కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యంతో.. ప్రథమ స్థానం కైవసం చేసుకున్న గణేశ్
పరీక్షలు రాయనున్న 75,576 మంది విద్యార్థులు
ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 75,576 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు తెలిపారు. వారిలో ఒకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 1900 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 40,082 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 35,494 మంది ఉన్నారు.
-పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్‌ఐఓ రవికుమార్
Students: చక్కని ప్రణాళికతో భావి పారిశ్రామికవేత్తలుగా..
కట్టుదిట్టమైన చర్యలు
నేటి నుంచి జిల్లాలో జరిగే ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు తదితరులు సెల్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. పరీక్ష కేంద్రాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఇతర సదుపాయాలకు సంబంధించి పర్యవేక్షణ పూర్తయింది. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం.
– సి.ఎస్.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి
Employment opportunities: గిరిజన యువతకుఉపాధి కల్పించడమే లక్ష్యం
మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు, పరీక్షకు మధ్య ఒక రోజు విరామం ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించారు. తొలి రోజు ఫస్టియర్ విద్యార్థులు, రెండో రోజు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్షా హాల్‌లోకి అనుమతిస్తారు. సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్లను మూసివేస్తారు. అనంతరం ఎవరినీ పరీక్ష హాల్‌లోకి అనుమతించరు.
Intermediate Public Exams: వెబ్‌ఎక్స్ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు..