Intermediate Public Exams: వెబ్‌ఎక్స్ సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు..
తుమ్మపాల: జిల్లావ్యాప్తంగా శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 38 కేంద్రాల్లో జరిగే ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 28,621 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీరు, ఫ్యాన్లు, వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
Digital Education: దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ విద్య అందించాలి
ఇంటర్ పరీక్షలను సజావుగా జరిపించాలని వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన వెబ్‌ఎక్స్ సమావేశంలో కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉండాలన్నారు. నిరంతర విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రశ్నపత్రాలను పోలీసు బందోబస్తుతో తీసుకు వెళ్లి ప్రతిరోజు ఉదయం 9 గంటలకు తెరవాలన్నారు. ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించాలన్నారు.
AP Inter Exams: ఏపీలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. అన్ని సెంటర్లలో ప్రత్యేక నిఘా
విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రజారవాణా శాఖ డీఎంను ఆదేశించారు. ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి సుజాత, డీఆర్వో దయా నిధి, డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ హేమంత్, డీపీవో శిరీషారాణి, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
పటిష్ట నిఘా
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడడం నిషేధమని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. సున్నితమైన పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు, వైఫై మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
Journalists: 5 నుంచి గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు