Skip to main content

Journalists: 5 నుంచి గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు ఈనెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొనసాగుతుందని సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తెలిపారు.
Membership registration of Greater Journalist Housing Society

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ పత్రికలు, టీవీ న్యూస్ చానళ్ళలో పని చేస్తున్న జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు మరోసారి సభ్యత్వ నమోదు చేపట్టాలని ఇటీవల జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్ణయించిందని, ఈ మేరకు వారం రోజుల పాటు సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో పని చేస్తున్న జర్నలిస్టులు స్థానికంగా కనీసం ఐదేళ్లు పనిచేసిన సర్వీస్ ఆధారాలతో పాటు ప్రస్తుతం జర్నలిస్టుగా పని చేస్తున్నట్లు దృవీకరణ పత్రం (ఐడీ కార్డు, అక్రెడిటేషన్ కార్డు లేదా సంస్థ నుంచి అపాయింట్మెంట్ లెటర్) తో పాటు స్థానిక నివాస ధృవీకరణ (ఆధార్ కార్డు లేదా గ్యాస్ బిల్, కరెంట్ బిల్లు), రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు దరఖాస్తు ఫారానికి జత చేయాలని వారు సూచించారు. వీటితో పాటు ''ది గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ'' లేదా ''Greater Hyd Journalists MAC Housing society'' పేరిట రూ.1050 బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) తీసి దరఖాస్తు ఫారానికి జత చేయాలని కోరారు. దరఖాస్తు ఫారాలు  వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి దగ్గరలో ఉన్న టీవీ కాలనీ ఫేస్ 4, ప్లాట్ నెంబర్ 198లో గల సొసైటీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు లభిస్తాయని, అర్హులైన జర్నలిస్టులు సభ్యత్వానికి కావలసిన సర్వీస్ ఆధారాలు, డీడీ తీసుకుని వచ్చి దరఖాస్తు నింపి సమర్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. మిగతా వివరాలకు ఫోన్ నెంబర్ 9100933723, 9393353519 లను సంప్రదించాలని కోరారు.

Published date : 01 Mar 2024 01:18PM

Photo Stories