Digital Education: దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ విద్య అందించాలి
Sakshi Education
విద్యార్థులకు అందాల్సిన వసతుల గురించి రాష్ట్ర సమగ్ర శిక్ష సహిత విద్యా పరిశీలకులు, జిల్లా సహిత విద్యా సమన్వయ అధికారి పాఠశాలను సందర్శించి అక్కడి ఉపాధ్యాయులకు ఈ సూచనలు ఇచ్చారు..
అనకాపల్లి: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు డిజిటల్ విద్య అందించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష సహిత విద్యా పరిశీలకులు డాక్టర్ వై.నరసింహం అన్నారు. గ్రేటర్ విశాఖ విలీన గ్రామమైన కొప్పాక ప్రైమరీ స్కూల్ ఆవరణలో ఉన్న భవిత కేంద్రాన్ని ఆయనతో పాటు జిల్లా సహిత విద్యా సమన్వయ అధికారి శకుంతల గురువారం సందర్శించారు.
Exam Center for Intermediate: పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు సిద్ధం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సేవలు, సదుపాయాలను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు, వరప్రసాద్, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయురాలు రమాదేవి, దివ్యాంగ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Published date : 01 Mar 2024 03:37PM