Skip to main content

Exam Center for Intermediate: పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు సిద్ధం..

మొదటి సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం నుండి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌..
Arrangements at exam centers for AP Intermediate Exams 2024

దేవరాపల్లి: దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం నుండి ప్రారంభమయ్యే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ పి. ఉమామహేశ్వరి, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సన్యాసిరావు తెలిపారు. ఈ మేరకు స్థానిక కళాశాలలో గురువారం విలేకరులతో మాట్లాడారు. మార్చి 1 నుండి 18 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

AP Inter Exams: ఏపీలో నేటి నుంచే ఇంటర్‌ పరీక్షలు.. అన్ని సెంటర్లలో ప్రత్యేక నిఘా

మొదటి సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం నుండి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 237 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 250 మంది, ప్రైవేటు విద్యార్థులు 25 మంది హాజరుతారన్నారు. దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీతో పాటు తెనుగుపూడి గురుకుల కళాశాల, బేతపూడి కేజీబీవీ, శారదాశ్రీ, పీవీసీ ఒకేషనల్‌ కళాశాలల నుండి విద్యార్థులు హాజరవుతారన్నారు.

AP Schools: నాడు-నేడు పథకంతో అభివృద్ధి చెందిన పాఠశాలలు..

సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు పరీక్ష సమయానికి 45 నిముషాల ముందు చేరుకోవాలన్నారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు.

Published date : 01 Mar 2024 12:42PM

Photo Stories