AP Schools: నాడు-నేడు పథకంతో అభివృద్ధి చెందిన పాఠశాలలు..

అనంతపురం: మా పాఠశాలలో మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. నాడు–నేడు పనులతో బాల బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించారు. ప్రతి తరగతి గదినీ పెయింటింగ్‌తో అందంగా తీర్చిదిద్దారు. లైట్లు, ఫ్యాను ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే జగనన్న ఆశయాలకు అనుగుణంగా బాగా చదువుకుంటున్నాం.
AP Intermediate 2024: నేడు ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు.. పకడ్బందీగా ఏర్పాట్లు..
– బి.కార్తీక్ 10వ తరగతి, మరూరు జెడ్పీహెచ్‌ఎస్
జగన్ మామయ్యకు థ్యాంక్స్
నాడు–నేడు కార్యక్రమం కింద ప్రతి తరగతి గదిలోనూ ఫర్నీచరు ఏర్పాటు చేశారు. గతంలో నేలపై కూర్చునేవాళ్లం. బాత్రూం పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చక్కటి మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మా పాఠశాలను ఒక నందనవనంలా మార్చిన జగన్ మామయ్యకు థ్యాంక్స్.
– కె.మైత్రి 9వ తరగతి, మరూరు జెడ్పీహెచ్‌ఎస్
Jaganna Vidyadeevena: పేద విద్యార్థులకు 'జగనన్న విద్యా దీవెన' పథకం జారీ..