Students: చక్కని ప్రణాళికతో భావి పారిశ్రామికవేత్తలుగా..
స్థానిక ఉడ్‌పేట జీవీఎంసీ ప్రైమరీ పాఠశాలలో గురువారం జరిగిన జిల్లా స్థాయి ఎంట్రప్రెన్యూర్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యనభ్యసించడంతోపాటు ఉపాధి కల్పన అవకాశాలను అన్వేషించాలని సూచించారు. 13 పాఠశాలల విద్యార్థులు వారి వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులను ఆమెతోపాటు డిప్యూటీ డీఈవో పి.అప్పారావు, ఏఎంవో మురళి పట్నాయక్, డీసీఈబీ సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి డి.కాళిదాసులు పర్యవేక్షించారు. ఉప్పరాపల్లి జెడ్పీ హైస్కూల్, వీరనారాయణం జెడ్పీ హైస్కూల్ జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలకు ఎంపికయ్యాయి. ఈ స్కూలు విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు పంపనున్నారు. విజేతలకు డీఈవో వెంకటలక్ష్మమ్మ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంపీడీపీ డిస్ట్రిక్ట్ మేనేజర్ నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.