Skip to main content

Employment opportunities: గిరిజన యువతకుఉపాధి కల్పించడమే లక్ష్యం

సీతారామరాజు జిల్లా: గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుందని కేవీకే కోఆర్డినేటర్‌ డా.లలితాకామేశ్వరి తెలిపారు.
aim is to provide Employment opportunities for tribal youth

ఈ కేంద్రంలో జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ,హైదరాబాద్‌ వారి ఆర్థిక సహకారంతో అలంకరణ చేపల ఉత్పత్తి, యాజమాన్య పద్ధతులపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌ఎస్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డా. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ కుటీర పరిశ్రమగా ఆక్వేరియం తయారీ, అలంకరణ చేపల ఉత్పత్తితో స్థానిక యువత ఉపాధి పొందవచ్చన్నారు. మత్స్య విభాగం శాస్త్రవేత్త కె. వీరాంజనేయులు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు శిక్షణలో అక్వేరియం తయారీ, వాటిలో వినియోగించు అలంకరణ వస్తువులు, చేపల ఎంపిక వంటి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. శిక్షణలో అవగాహన పొందిన అంశాలతో సొంతంగా తయారు చేసే విధంగా గిరిజన యువత ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌వో కె చిట్టిబాబు, కేవీకే శాస్త్రవేత్తలు టి. క్రాంతికుమార్‌, చిరంజీవి, మత్స్యశాఖ అధికారి సీహెచ్‌ రమేష్‌ పాల్గొన్నారు.

చదవండి: Indian Navy Recruitment 2024: 254 షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Published date : 01 Mar 2024 01:40PM

Photo Stories