Skip to main content

Degree Lecturer Results: కాలు కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యంతో.. ప్రథమ స్థానం కైవసం చేసుకున్న గణేశ్‌

ఆదిలాబాద్‌టౌన్‌/తాంసి: కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు జిల్లా కు చెందిన బోడ్కుంటవార్‌ గణేశ్‌, బెల్లపు నగేశ్‌, నడికుంట్ల అవినాశ్‌.
Ganesh secured the first place in Gurukula degree results

 గణేశ్‌ 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయినప్పటికీ వెనుకడు గు వేయకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాడు. ఫిబ్ర‌వ‌రి 28న‌ వెలువడిన గురుకుల డిగ్రీ ఫలితా ల్లో ఆంగ్ల సబ్జెక్టుకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాడు. బేల మండల కేంద్రానికి చెందిన ఈయన ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రభు త్వ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.

గ్రూప్స్‌, సివిల్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో డిగ్రీ గురుకుల నోటిఫికేషన్‌ రావడంతో పరీక్ష రాశాడు. లెక్చరర్‌గా మరోసారి సర్కారు కొలువు దక్కించుకున్నాడు. తాంసి మండల కేంద్రానికి చెందిన బెల్లపు నగేశ్‌ డిగ్రీ లెక్చరర్‌గా, భీంపూర్‌ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన నడికుంట్ల అవినాశ్‌ జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికయ్యారు.

నగేశ్‌ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సైనిక్‌ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. నడికుంట్ల అవినాష్‌ సైతం గురుకుల జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాల్లోప్‌ ప్రతిభ కనబరిచి ఎకనామిక్స్‌ విభాగంలో జూనియర్‌ లెక్చరర్‌ గా ఉద్యోగం సాధించాడు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.

చదవండి: Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

బెల్లంపల్లి: బెల్లంపల్లి బస్తీకి చెందిన దేవునూరి అర్జున్‌ ఎంకామ్‌, బీఈడీ పూర్తి చేసి గురుకుల టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌ పోటీ పరీక్షలు రాశాడు. పీజీటీ సోషల్‌లో రాష్ట్రస్థాయిలో 14వ ర్యాంకు సాధించాడు. ఫిబ్రవరి 15న హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రం అందుకున్నాడు. ఫిబ్ర‌వ‌రి 29న‌ వెలువడిన గురుకుల జూనియర్‌ కామర్స్‌ లెక్చరర్‌ ఫలితాల్లో టీజీటీ సోషల్‌లో 185 మార్కులు సాఽధించి లెక్చరర్‌గా రెండో ఉద్యోగం సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు 2019లో గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగానికి ఎంపికై వారం రోజుల్లోనే రాజీనామా చేశాడు.

చదవండి: Inspirational Stories: ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. ఇలా ఎంద‌రికో ఉన్న‌త కొలువులు..

రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు

నిర్మల్‌ రూరల్‌: నిర్మల్‌ రూరల్‌ మండలం నీలాయిపేట గ్రామానికి చెందిన మట్టె భూమన్న– రాజవ్వ ల కుమార్తె మట్టె రజిత ఫిబ్ర‌వ‌రి 29న‌ వెలువడిన గు రుకుల జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూ నియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించింది. కొన్ని రోజుల క్రితం వెలువడిన పీజీటీ ఫలితాల్లోనూ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ ఉద్యోగం కూడా సాధించింది. ఒకే నెలలో రెండు ఉద్యోగాలు రావడంతో ఆ నందంగా ఉందని రజిత పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి, తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతో విజయం సాధించానని రజిత తెలిపారు.

మెదన్‌పూర్‌ యువతి..

కుంటాల: మండలంలోని మెదన్‌పూర్‌ గ్రామానికి చెందిన కార్యం సుప్రియ గురుకుల నియామక బో ర్డు వెల్లడించిన ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే జూనియర్‌ లెక్చరర్‌, పీజీటీ ఉద్యోగాలకు ఎంపికై ంది. ఇంగ్లిష్‌ సబ్జెక్టులో రెండు ఉద్యోగాలు సాధించింది. తన మామయ్య కార్యం పెద్దరాజన్న, భర్త రా జు, కుటుంబ సభ్యుల ప్రోత్సహంతో ఈ విజయం సాధ్యమైందని కార్యం సుప్రియ తెలిపారు.

Published date : 01 Mar 2024 01:39PM

Photo Stories