Skip to main content

Holidays: జ‌న‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది క‌నుక‌...స్కూల్స్‌, కాలేజీలకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది.
Holidays
Schools and Colleges Holidays

స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు ముగియ‌డంతో మ‌ళ్లీ వాటిని జ‌న‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అలాగే ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు య‌థ‌విధిగా కొన‌సాగుతాయ‌న్నారు. ఒమిక్రాన్‌, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో గ‌తంలో జ‌న‌వ‌రి 16వ తేదీ వ‌ర‌కు సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వుల‌ను పొడిగించారు.

తెలంగాణ‌లో అయితే..

Telangana Schools Holidays


తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్‌సెక్రటరీ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి జ‌న‌వ‌రి 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాతిని కలిపేసుకుని 16వ తేదీ వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయించినట్లు సమాచారం.

ఎక్కువ రోజులు సెలవులు పొడిగిస్తే..
రాష్ట్రంలో కరోనా ఆంక్షలను జ‌న‌వ‌రి 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. జ‌న‌వ‌రి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో సెలవులను కూడా 30వ తేదీ వరకు పొడిగించారు. ఎక్కువ రోజులు సెలవులు పొడిగిస్తే మాత్రం సర్కారు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. లేకపోతే అటు ప్రత్యక్ష తరగతులు, ఇటు ఆన్‌లైన్ పాఠాలు నిర్వహించలేదన్న విమర్శలు వస్తాయని ప్రభుత్వం యోచిస్తోంది. 

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే..

AP Schools


ఇంట‌ర్ కాలేజీల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్రాంతి సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 8వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు సెల‌వులు ఉంటాయి. అలాగే జ‌న‌వ‌రి 17వ తేదీన కాలేజీల‌ను తిరిగి ప్రారంభిస్తామ‌ని తెలిపారు. అన్ని ప్ర‌భుత్వ , ప్రైవేట్ కాలేజీల‌కు సెల‌వులు ఇస్తున్న‌ట్టు ఏపీ ఇంట‌ర్ బోర్డ్ ప్ర‌క‌టించింది. అలాగే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు కూడా సంక్రాంతి సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. మళ్లీ 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఆలోచ‌న లేద‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. తెలంగాణ‌లో మాదిరిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తార‌ని త‌ల్లిదండ్రులు బావించారు. అయితే ఏపీలో కూడా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది క‌నుక ప్ర‌భుత్వం కూడా ఇలాంటే నిర్ణ‌యమే తీసుకుంటుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని ప్ర‌భుత్వం మాత్రం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది.

Breaking News: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఇక ఏపీలో అయితే.. ?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Telangana: జ‌న‌వ‌రి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Covid-19 Effect: జనవరి 26 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌

Audimulapu Suresh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించ‌డం లేదు..కార‌ణం ఇదే..

Published date : 17 Jan 2022 03:32PM

Photo Stories