Online Education: ఈ తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన.. జనవరి 31 తర్వాత పరిస్థితి బాగుంటే..
సోమవారం (24వ తేదీ) నుంచి ఆన్‌లైన్, దూర విద్య క్లాసులు నిర్వహించేందుకు అనుమతించారు. ఈ మేరకు జనవరి 22వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 50 శాతం మంది రొటేషన్ పద్ధతిలో హాజరవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై స్కూల్ హెచ్‌ఎంలు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కారణం ఇదే..?
క్లాసులు మొదలుపెడదామనుకున్నా..
జనవరి 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో సెలవులను జనవరి 30 వరకూ పొడిగించింది. పరిస్థితి బాగుంటే జనవరి 31 నుంచి క్లాసులు మొదలుపెట్టాలనుకున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వేలో కోవిడ్ కేసులు, లక్షణాలున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పాఠశాలల్లో శానిటైజేషన్ ప్రక్రియ అంతంతగానే ఉందని జిల్లా విద్యా శాఖ అధికారులు నివేదికలు పంపారు.
Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
విద్యా సంస్థల్లో కోవిడ్ మొదలైతే వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్య శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. స్కూళ్లు తెరిచినా విద్యార్థులను ధైర్యంగా పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని అధికారులు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విద్యా శాఖ ఉన్నతాధికారులు సమీక్ష జరిపి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
Schools: జనవరి 24 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. ఒకవేళ కోవిడ్ కేసులు అధికమైతే..
Breaking News: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఇక ఏపీలో అయితే.. ?
Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?
Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Online Classes: నేటి నుంచే స్కూల్స్‌కు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం.. జనవరి 30 తర్వాత..?
Telangana: జనవరి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవకాశం..ఎందుకంటే..?
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..