Skip to main content

Group-1&2: గ్రూప్‌–1కు 900 మార్కులు, గ్రూప్‌–2కు 600 మార్కులతో రాత‌ప‌రీక్ష‌.. ఈ సారి సిలబస్‌లో..!

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షల్లో ఆ మేర మార్కులనూ తగ్గించాలని భావిస్తోంది.
TSPSC Group 1& Group 2
TSPSC Group 1& Group 2 Marks

ఇప్పటివరకు అన్ని పేపర్లతోపాటు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఉండే గరిష్ట మార్కులు ఉండగా.. ఇక ముందు కేవలం రాతపరీక్షల మొత్తమే గరిష్ట మార్కులు కానున్నాయి. ఈ క్రమంలో గ్రూప్‌–1 పరీక్ష మొత్తంగా 900 మార్కులకు, గ్రూప్‌–2 పరీక్ష మొత్తంగా 600 మార్కులకే ఉండనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు పరీక్షా విధానానికి సంబంధించిన ప్రక్రియను దాదాపు కొలిక్కి తీసుకువచ్చాయి.ఈ సారి గ్రూప్‌-1లో    503 ఉద్యోగాలను, గ్రూప్‌-2లో 582 పోస్టులు పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

రాతపరీక్ష‌ ఆధారమే.. కానీ

Exam


గ్రూప్‌–1, గ్రూప్‌–2 కొలువులకు, వైద్యారోగ్య సంస్థల్లో మెడికల్‌ ఆఫీసర్, ఆపై స్థాయిలో నేరుగా చేపట్టే నియామకాలకు ఇంటర్వ్యూలు, గురుకుల విద్యాసంస్థల్లో బోధన పోస్టులకు సంబంధించి డెమో రౌండ్‌ ఇప్పటి వరకు కీలకంగా ఉండేవి. నియామకాల్లో జాప్యాన్ని నివారించడం, అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం కోసం వీటిని రద్దుచేసి, రాతపరీక్షల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు దృష్టి సారించాయి. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతోపాటు వాటికి సంబంధించిన మార్కులను కూడా తొలగిస్తేనే మంచిదన్న ప్రతిపాదన చేశాయి. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తగ్గనున్న మార్కులు ఇలా..
☛ ఇదివరకు గ్రూప్‌–1 పరీక్షను మొత్తంగా 1000 మార్కులకు నిర్వహించేవారు. అందులో 900 మార్కులకు వివిధ రాతపరీక్షలు, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉండేవి. ఇక గ్రూప్‌–2 పరీక్షను 675 మార్కులకు నిర్వహించగా.. అందులో 75 మార్కులు ఇంటర్వ్యూలకు ఉండేవి. ఇప్పుడు ఇంటర్వ్యూల మార్కులను తొలగిస్తే.. గ్రూప్‌–1 పరీక్ష 900 మార్కులకు, గ్రూప్‌–2 పరీక్షను 600 మార్కులకే నిర్వహించే అవకాశం ఉంది.
☛ ప్రస్తుతం గురుకుల విద్యాసంస్థల్లో పీజీటీ, జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌ నియామకాల్లో రాతపరీక్షలతోపాటు డెమో (ప్రత్యక్ష బోధన పరీక్ష) ఉంది. ప్రభుత్వం గ్రూప్స్‌ పరీక్షలకు ఇంటర్వ్యూలను తొలగించడంతో డెమో విధానానికి స్వస్తి పలకాలని అధికారులు భావిస్తున్నారు.
☛ ఇప్పటివరకు వైద్యారోగ్య విభాగంలోని కొన్నిపోస్టులకు కేవలం ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తూ వచ్చారు. ఈసారి ఆయా పోస్టుల నియామకాలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంపై బోర్డు కసరత్తు చేస్తోంది. 

Groups Guidance: మొదటిసారిగా గ్రూప్‌ 2 రాస్తున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

ఈ సారి సిలబస్‌లో మార్పులు లేనట్టే..!
ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో మార్పులు అనివార్యమయ్యాయి. అయితే పరీక్షల సిలబస్‌లో మార్పులు అవసరం లేదని నియామక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూలు తొలగించినందున.. ఆయా సామర్థ్యాలకు సంబంధించిన అంశాలను రాతపరీక్షలో చేర్చే ప్రతిపాదన కూడా ఉంది.

ఈ ఏడాది (2022) తెలంగాణ‌లో భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్స్-1,2 ఉద్యోగాలు ఇవే..:
➤ గ్రూప్‌-1 పోస్టులు:  503

 గ్రూప్‌-2 పోస్టులు : 582

Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్‌ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!

టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌ –1 పోస్టులు : 

➤జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2
➤అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌–40
➤అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌–38
➤ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(వైద్యారోగ్యశాఖ)–20
➤ డీఎస్పీ– 91
➤ జైల్స్‌ డిప్యూటీ సూపరిండెంట్‌–2
➤ బఅసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌–8
➤డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌–2
➤జిల్లా మైనారీటీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–6
➤మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2(35)
➤ఎంపీడీవో(121)
➤డీపీవో(5)
➤కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌(48)
➤డిప్యూటీ కలెక్టర్‌(42)
➤అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌(26)
➤జిల్లా రిజిస్ట్రార్‌(5)
➤జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(3)
➤ఆర్టీవో(4)
➤ జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2) 
మొత్తం:  503

వయోపరిమితి ఇలా..
☛ ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
☛ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
☛ దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
☛ ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

 

Published date : 22 Apr 2022 01:13PM

Photo Stories