R Krishnaiah: నిరుద్యోగ సమస్యపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలి
Sakshi Education
ముషీరాబాద్: గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల డిమాండ్‌లను గుర్తించి వాటిని పరిష్కరించడానికి అఖిల పక్ష సమావే శాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ మేరకు లేఖ రాశారు. నిరుద్యోగుల ఉద్యమాలపై నిర్బంధం సరికాద ని నిరుద్యోగులపై లాఠీచార్జ్, అణచివేతను తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగ జేఏసీ అధ్య క్షుడు నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో జూలై 16న విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో సమావే శమై ప్రభుత్వానికి పలు డిమాండ్‌లు చేశారు.
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు 1:100 పిలవాల ని, గ్రూప్–1లో 563 నుంచి 1600 పోస్టులను పెంచాలని, గ్రూప్–2లో 780 నుంచి రెండు వేల పోస్టులకు పెంచాలని, గ్రూప్–3లో 1100 నుంచి మూడు వేల పోస్టులకు పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ రెండు నెలలు వాయిదా వేయాలని కోరారు. సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు వేముల రామకృష్ణ, మోడీరాందేవ్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 18 Jul 2024 10:47AM