TS Asha Worker Jobs 2023 : 1,540 ఆశా వర్కర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త అందించింది. 1,540 ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ జిల్లాలో 323, మేడ్చల్ జిల్లాలో 974, రంగారెడ్డి జిల్లాలో 243 ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భర్తీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. తెలంగాణ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ.. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
1,540 ఆశా వర్కర్ల ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
Published date : 21 Mar 2023 07:14PM