SSC Constable Jobs 2023 : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. 50,187 కానిస్టేబుల్ పోస్టులు.. ఎంపికైతే రూ.69,100 వరకు జీతం.. అర్హతలు ఇవే..
కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో పేర్కొన్న పోస్టుల సంఖ్యలో ఇప్పటికే రెండుసార్లు సవరణ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి తాజాగా ఎస్‌ఎస్‌సీ.. ఆ సంఖ్యను 50,187కి పెంచుతున్నట్టు మార్చి 20వ తేదీన (సోమవారం) ప్రకటించింది.
☛ 5369 Central Government Jobs 2023: విజయం సాధించే మర్గాలు ఇవే..
వయోపరిమతిని కూడా..
అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడటం, నోటిఫికేషన్లు రాకపోవడంతో ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వయోపరిమతిని కూడా మూడేళ్ల పాటు పెంచుతున్నట్లు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ అక్టోబర్ 27న విడుదల కాగా.. పరీక్షను కూడా నిర్వహించారు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 24369 ఖాళీ పోస్టులను ఎస్‌ఎస్‌సీ ఇటీవల పేర్కొనగా.. తర్వాత నెల రోజులకు ఈ పోస్టులను పెంచుతున్నట్లు కమిషన్ వెబ్ సైట్లో పేర్కొంది.
చదవండి: SSC Exam Syllabus
24369 నుంచి 50,187 వరకు పెరిగిన ఉద్యోగాలు ఇవే..
దాదాపు 25 వేల నుంచి 45,284 వరకు ఈ పోస్టులను పెంచగా.. ఇదే క్రమంలో ఫిబ్రవరిలో మరోసారి సవరణ చేస్తూ 1,151 ఉద్యోగ ఖాళీలను కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 46,435కి పెరిగింది. ఇప్పుడు తాజాగా ఐటీబీపీ విభాగంలో సిబ్బంది నియామకానికి మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 50,187కు పెరిగినట్టు ఎస్‌ఎస్‌సీ ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా.. రాష్ట్రాల వారీగా పోస్టుల ఖాళీలను కూడా ప్రకటించింది.
చదవండి: SSC పరీక్షల స్టడీ మెటీరియల్
పోస్టుల వివరాలు ఇలా..
బీఎస్‌ఎఫ్‌లో 21,052, సీఐఎస్‌ఎఫ్‌లో 6060, సీఆర్‌పీఎఫ్‌లో 11169, ఎస్‌ఎస్‌బీలో 2274, ఐటీబీపీలో 1890+3752, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175తో కలిపి మొత్తం 50,187 ఖాళీలున్నాయి.
ఎంపిక విధానం ఇలా..
ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ ఐదు దశల్లో జరుగుతుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ (DME/ RME), డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ఐదు దశల్లో ఎంపిక చేస్తారు.
చదవండి: SSC Recruitment 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 5369 పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..
జీతం :
సెలక్షన్ ప్రాసెస్ క్లియర్ చేసిన వారికి NCB సిపాయి పోస్టుకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు జీతం లభిస్తుంది. ఇతర పోస్టులకు రూ. 21,700 నుంచి 69,100 మధ్య జీతం లభిస్తుంది.
50,187 కానిస్టేబుల్ పోస్టుల పూర్తి వివరాలు ఇవే..