Skip to main content

Central Government Jobs 2023 : శుభ‌వార్త‌.. కేంద్రంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు.. ఖాళీల వివ‌రాలు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్రం ప్ర‌భుత్వంలోని పలు విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని ప్రభుత్వం మార్చి 29వ తేదీన (బుధవారం) తెలిపింది.
central government jobs 2023 details in telugu
central government jobs 2023 details

లోక్‌స‌భ‌లో కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2021 మార్చి 1 నాటికి అన్ని శాఖలు, విభాగాలు, సంస్థల్లో 9.79 లక్షలకుపైగా ఖాళీలున్నాయ‌న్నారు. వీటి అన్నింటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించామ‌ని మంత్రి అన్నారు.  

పోస్టుల వివ‌రాలు ఇవే..

central government teacher jobs telugu

☛ రైల్వేశాఖలోనే 2.93 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 
☛ రక్షణ శాఖలో 2.64 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి.  
☛ హోం శాఖలో 1.43 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి.  
☛ రెవెన్యూలో 80,243 ఉద్యోగాలు ఉన్నాయి.  
☛ ఆడిట్‌–అకౌంట్‌ విభాగంలో 25,934 ఉద్యోగాలు ఉన్నాయి.  
☛ అణు ఇంధన శాఖలో 9,460 ఉద్యోగాలు ఉన్నాయి. 

9,79,327 లక్షల ఉద్యోగాల శాఖ‌ల వారిగా పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

Published date : 30 Mar 2023 05:40PM

Photo Stories