Skip to main content

SSC JOBS 2023 : 5,369 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) 5,369 ఉద్యోగాల‌కు భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
SSC Jobs 2023 details telugu
SSC Jobs 2023

ఈ పోస్టుల‌కు మార్చి 6వ తేదీన నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తుంది. ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌, లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, అకౌటెంట్‌, రీసెర్చి ఇన్వెస్టిగేటర్‌,  టెక్నికల్‌ అసిస్టెంట్‌ సహా మొత్తం 5,369 ఉద్యోగాలు ఉన్నాయి.

SSC పరీక్షల స్టడీ మెటీరియల్

అర్హతలు ఇవే : 
పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వయోపరిమితి :
అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : 
స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటా ఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం :

ssc jobs exam news telugu

పరీక్షలో భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.

➤ SSC Jobs: పదో తరగతితోనే... కేంద్ర ప్రభుత్వంలో 12,523 పోస్ట్‌లు... రాత పరీక్షలో విజయానికి ఇలా!

పోస్టుల వివరాలు ఇవే..: 

ssc jobs details 2023

ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్టేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ తదితరాలు.

➤ Central Government Exams 2023 : నిరుదోగ్యులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌లు.. లోక‌ల్ భాష‌ల్లోనే..

ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇలా..: 

ssc online applications

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 6 నుంచి 27 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. మార్చి 28 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల్లో పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు :  
హైదరాబాద్‌, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

➤ 24,369 Constable Jobs In SSC: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌ : https://ssc.nic.in/
SSC 5,369 ఉద్యోగాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలను కింది PDF లో చూడొచ్చు..

Published date : 07 Mar 2023 01:16PM
PDF

Photo Stories