Skip to main content

Central Government Exams 2023 : నిరుదోగ్యులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌లు.. లోక‌ల్ భాష‌ల్లోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ (SSC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు జ‌న‌వ‌రి 21వ తేదీన (శ‌నివారం) గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ మేర‌కు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

➤ SSC Jobs Notification : 11409 ఉద్యోగాల భ‌ర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తోనే.. పూర్తి వివ‌రాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో..

SSC KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నవంబర్‌ 18. 2020న ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్పూర్తిని కొనసాగించాలని కోరారు. రైల్వేలు, డిఫెన్స్‌, బ్యాంకులు తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మాత్రమే నిర్వహించడం సరికాదన్నారు. కేసీఆర్‌ డిమాండ్‌కు ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. భిన్న భాషలున్న దేశంలో ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లోనే పరీక్షలు నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని  కేంద్రాన్ని కోరారు. కాగా, కేసీఆర్ డిమాండ్ మేరకు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది.

➤ LIC jobs 2023 : ఎల్ఐసీ 9,394 ఉద్యోగాల భ‌ర్తికి నోటిఫికేషన్ విడుదల.. జీతం రూ.90,250.. పూర్తి వివ‌రాలు ఇవే..

☛ Success Story : వరుసగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టానిలా.. ఇలా చదవడం వ‌ల్లే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖ ఇదే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖ ఇదే..
Published date : 21 Jan 2023 08:54PM

Photo Stories