LIC jobs 2023 : ఎల్ఐసీ 9,394 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ విడుదల.. జీతం రూ.90,250.. పూర్తి వివరాలు ఇవే..
అలాగే హైదరాబాద్ జోనల్ పరిధిలో 1,408 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు జనవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హల్ టిక్కెట్లలను మార్చి 4వ తేదీన విడుదల చేయనున్నారు. మార్చి 12వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను మాత్రం ఏప్రిల్ 8వ తేదీన నిర్వహించనున్నారు. ఇటీవలే ఎల్ఐసీ 300 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. వీటికి కూడా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
LIC 9,394 ADO ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్య సమాచారం ఇదే..
అర్హతలు : డిగ్రీ
వయోపరిమితి : జనవరి 1, 2023 నాటికి 21 – 30 ఏళ్ల మద్య ఉండాలి. అలాగే రిజర్వేషన్ ఆధారంగా సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : రాత పరీక్ష (ఆన్‌లైన్) & ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు : 750/-, SC, ST అభ్యర్థులకు.. 100/-)
జీతం : రూ.35,650 – రూ.90,250
Apprentice Development Officers: 9394 Posts
- North: 1216 Posts
- North Central: 1033 Posts
- Central: 561 Posts
- East: 1049 Posts
- South Central: 1408 Posts
- Southern: 1516 Posts
- Western: 1942 Posts
- East Central: 669 Posts