Skip to main content

LIC Job Notification : డిగ్రీ అర్హ‌త‌తో.. ఎల్ఐసీలో ఉద్యోగాలు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(LIC HFL)శాఖల్లో 250 మంది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 19, తెలంగాణ‌లో 30 ఖాళీలు ఉన్నాయి.
LIC HFL Apprentice Recruitment 2023  30 Apprentice Vacancies at LIC Housing Finance   LIC Jobs Notification Details in Telugu    LIC HFL Recruitment  19 Apprentice Vacancies at LIC HFL

శిక్ష‌ణ వ్య‌వ‌ధి 12 నెల‌లు ఉంటుంది. ఈ అప్రెంటిస్‌ల‌కు ఏదైనా డిగ్రీ అర్హ‌త ఉండాలి. 01-12-2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వ‌యోప‌రిమితి ఉండాలి. ఈ అప్రెంటిస్‌ల‌కు ఎంపికైతే జ‌న‌వ‌రి 15, 2024 శిక్ష‌ణ ప్రారంభం అవుతుంది.

ఈ అప్రెంటిస్‌ల‌కు నెలకు రూ.9,000 నుంచి రూ 15,000 స్టైపెండ్ ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక‌ చేస్తారు. ద‌ర‌ఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ, ఓబీసీలకు రూ.944/-, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ. 708/- దివ్యాంగ అభ్యర్థులకు రూ.472/- ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇలా..
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 31.12.2023.
పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03-01-2024.
రాత పరీక్ష తేదీ : 06-01-2024. డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
ఇంటర్వ్యూ తేదీలు : 09-01-2024 నుంచి 11-01-2024 వరకు.

పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 27 Dec 2023 03:03PM
PDF

Photo Stories