LIC Jobs 2023 : నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. ఎల్‌ఐసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలకు ఇవే..
ఈ మేరకు ఎల్ఐసీ 300 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది.
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
వయసు జనవరి 1, 2023 నాటికి తప్పనిసరిగా 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1993 నుంచి జనవరి 1, 2002 మధ్య జన్మించిన వారు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 31, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు :
జనరల్ అభ్యర్థులు రూ. 700 ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 85లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్ష తేదీలు :
ప్రిలిమ్స్ ఫిబ్రవరి 17, 20 తేదీల్లో జరుగుతుంది. మెయిన్స్ రాత పరీక్ష మార్చి 18న ఉంటుంది.
జీతం :
AAO ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.53,600 నుంచి రూ.1,02,090ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎల్ఐసీ 300 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..