Skip to main content

LIC Jobs Success Tips 2023 : ఎల్ఐసీలో 9,394 పోస్టులు.. నెలకు రూ.56,000 జీతం.. ఈ ఉద్యోగం కొట్టే మార్గాలు ఇవే..

దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ.. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC).. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిది జోన్ల పరిధిలో 9,394 ఏడీఓ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
LIC ADO Jobs Details in telugu
LIC Jobs Success Tips

ఇందులో విజయం సాధించి అప్రెంటీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (ADO) కొలువు సొంతం చేసుకుంటే.. బీమా రంగంలో సుస్థిర కెరీర్‌ ఖాయం అవుతుంది. కొద్దిగా కష్టపడితే బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగం దక్కించుకోవచ్చు. ఎల్‌ఐసీ.. ఏడీఓ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. పోస్టుల‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. 

బీఎఫ్‌ఎస్‌ఐ.. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్న సెక్టార్‌. ఈ రంగంలో కొలువు సాధిస్తే.. సుస్థిర భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డిగ్రీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశంగా ఎల్‌ఐసీ ఏడీఓ నోటిఫికేషన్‌. ఈ కొలువుకు ఎంపికైతే ఆకర్షణీయ వేతనం సొంతం చేసుకోవచ్చు.

➤ LIC AAO Recruitment 2023: ఎల్‌ఐసీలో 300 ఏఏఓఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు & చివరి తేదీ.

9,394 ఉద్యోగాలు.. ఏఏ జోన్‌లో ఎన్ని పోస్టులంటే..

lic ado jobs zone wise list in telugu

దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్‌ సంస్థగా ఉన్న ఎల్‌ఐసీ.. ఏడీఓ పోస్ట్‌లను భారీ సంఖ్యలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎనిమిది జోన్ల పరిధిలో 9,394 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ మధ్య జోన్‌లోని తొమ్మిది డివిజన్లలో 712 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

➤ LIC Jobs 2023 : నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. ఎల్‌ఐసీలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్.. పూర్తి వివ‌రాల‌కు ఇవే..
పోస్టుల వివ‌రాలు ఇవే..
ఆ వివరాలు.. కడప– 90, హైదరాబాద్‌–91, కరీంనగర్‌–42, మచిలీపట్నం–112, నెల్లూరు–95, రాజమండ్రి–69, సికింద్రాబాద్‌–94, విశాఖపట్నం–57, వరంగల్‌–62. మొత్తం దక్షిణ మధ్య జోన్‌లో.. 1,408 పోస్టులు, నార్త్‌ జోన్‌లో 1216, నార్త్‌ సెంట్రల్‌ జోన్‌లో 1033, సెంట్రల్‌ జోన్‌లో 561, ఈస్ట్‌ జోన్‌లో 1049, సదరన్‌ జోన్‌లో 1516, వెస్ట్రన్‌ జోన్‌లో 1942, ఈస్ట్‌ సెంట్రల్‌ జోన్‌లో 669 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.

అర్హతలు ఇవే..
➤ జనవరి 1, 2023 నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
➤ వయోప‌రిమితి : జనవరి 1, 2023 నాటికి 21–30 ఏళ్లు(జనవరి 2, 1993 – జనవరి 1, 2002 మద్య జన్మించి ఉండాలి) ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్లు సడలింపు ఇస్తారు.

స్టయిఫెండ్ ఎంత ఇస్తారంటే..: 
అప్రెంటీస్‌ సమయంలో నెలకు రూ. 51,500 స్టయిఫండ్‌ లభిస్తుంది. 

➤ SSC Jobs Notification : 11409 ఉద్యోగాల భ‌ర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తోనే.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఎంపిక విధానం ఇలా..
డివిజన్ల ప్రాతిపదికగా దరఖాస్తులను స్వీకరించి.. ఎంపిక ప్రక్రియలో వారు చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటూ.. ఆయా డివిజన్‌ల ఆధారంగా నియామకాలు ఖరారు చేయనున్నారు. అంటే.. అభ్యర్థులు తాము ఏ డివిజన్‌లో పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకుంటున్నారో.. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లోనే పేర్కొనాల్సి ఉంటుంది. అదే విధంగా ఒక అభ్యర్థి ఒక డివిజన్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

➤ 1904 TS Court Jobs : ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..? ఇలా చ‌దివితే.. డిస్ట్రిక్ కోర్టు ఉద్యోగం మీదే..

మూడు దశల ఎంపిక ప్రక్రియ..

lic ado job exam pattern 2023 telugu

ఏడీఓ పోస్ట్‌లకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ. 
1. ప్రిలిమినరీ పరీక్ష విధానం ఇలా.. :
ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను మూడు విభాగాల్లో 70 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ విభాగం కేవలం అర్హత పరీక్షగానే పేర్కొన్నారు. ఈ విభాగంలో పొందిన మార్కులను మెరిట్‌ జాబితాకు పరిగణనలోకి తీసుకోరు.
2. మెయిన్ ప‌రీక్ష విధానం ఇలా.. :
తొలిదశ ప్రిలిమ్స్‌లో పొందిన మార్కుల ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు 20 మందిని చొప్పున(1:20 నిష్పత్తిలో) మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్ష 160 మార్కులకు మూడు విభాగాల్లో నిర్వహిస్తారు. రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ 50 ప్రశ్నలు–50 మార్కులు, జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ అండ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌ 60 ప్రశ్నలు–60 మార్కులకు మెయిన్‌ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్షకు లభించే వ్యవధి రెండు గంటలు.
3. చివరి దశ ఇంటర్వ్యూ ఇలా.. :
మెయిన్‌లో పొందిన మార్కుల ఆధారంగా.. పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. వీరికి చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. 40 మార్కులకు నిర్వహించే ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థులకు బీమారంగంతోపాటు సమకాలీన పరిణామాలపై అవగాహన, బీమా రంగంలో కొలువుపై ఆసక్తి, వ్యక్తిగత నేపథ్యం వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ మూడు దశల్లోనూ విజయం సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి అప్రెంటీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా కొలువు ఖరారు చేస్తారు.నెలకు రూ. 51,500 స్టయిఫండ్‌.

➤ Jobs: జస్ట్‌ పది పాస్‌తో 40,889 ఉద్యోగాలు... నాలుగు గంటలే పని.. పూర్తి వివరాలు ఇవే

అన్ని అలవెన్సులు కలిపి నెలకు..

lic jobs salary

అప్రెంటీస్‌ ఆఫీసర్‌గా కొలువు ఖరారు చేసుకున్న వారికి అప్రెంటీస్‌షిప్‌ సమయంలోనే నెలకు రూ. 51,500 స్టయిఫండ్‌ చెల్లిస్తారు. ఆ తర్వాత ప్రొబేషనరీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా నియమిస్తారు. ఏడాది ప్రొబేషన్‌ సమయంలో స్థూల వేతనం, ఇతర అన్ని అలవెన్సులు కలిపి నెలకు రూ.56,000 వరకూ జీతం లభిస్తుంది. ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా నియామకం ఖరారు చేస్తారు. అప్రెంటీస్‌ సమయంలో థియరీ, ఫీల్డ్‌ సేల్స్‌ ట్రైనింగ్‌ అంశాలపై శిక్షణనిస్తారు. అదే విధంగా ఏడీఓగా ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు విధులు నిర్వహిస్తామని రూ.మూడు లక్షల విలువ చేసే సర్వీస్‌ బాండ్‌ అందించాల్సి ఉంటుంది.

➤ Indian Postal Jobs 2023 : ఏపీలో 2480, తెలంగాణ‌లో 1266 ఉద్యోగాలు.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌తోనే.. ఎటువంటి ప‌రీక్ష లేకుండానే..

ఇలా చ‌దివితే.. విజయం మీదే..

lic ado jobs plan

ఎల్‌ఐసీ నిర్వహిస్తున్న ఏడీఓ పోస్ట్‌ల రాత పరీక్షల్లో విజయానికి సబ్జెక్ట్‌ వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..
➤ రీజనింగ్‌ ఎబిలిటీ :
రీజనింగ్‌ విభాగంలో రాణించేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కికత్వం పెంచుకునే విధంగా కృషి చేయాలి.సిరీస్, అనాలజీ, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్,ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ అంశాల్లో పరిపూర్ణమైన అవగాహన పొందడం అవసరం.
➤ న్యూమరికల్‌ ఎబిలిటీ :
ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా.. ప్యూర్‌ మ్యాథమెటిక్స్‌ అంశాలపై దృష్టి సారించాలి. ముఖ్యంగా టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.
➤ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ : 
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందులో రాణించేందుకు.. బేసిక్‌ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్,జంబుల్డ్‌ సెంటెన్సెస్,ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యక దృష్టి పెట్టాలి.
➤ జీకే, కరెంట్‌ అఫైర్స్ : 
జనరల్‌ నాలెడ్జ్‌లో మెరుగైన మార్కులు సాధించేందుకు.. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపై పట్టు సాధించాలి. అదే విధంగా స్టాక్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపై పట్టు సాధించాలి. ఇక.. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలను తెలుసుకోవాలి. అదే విధంగా ద్వైపాక్షిక ఒప్పందాలు, జాతీయ–అంతర్జాతీయ సదస్సులు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. వీటితోపాటు ఆయా దేశాలకు సంబంధించిన నూతన అధ్యక్షులు, అంతర్జాతీయ క్రీడలు–విజేతలు, అవార్డులు వంటి సమాచారాన్ని కూడా సేకరించుకోవాలి.

➤ ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌ అవేర్‌నెస్ : 
మెయిన్‌లో అత్యంత కీలకమైన విభాగం ఇది. ఇందులో అభ్యర్థులకు బీమా రంగం, అదే విధంగా ఆర్థిక రంగంపై ఉన్న అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. బీమా రంగంలోని తాజా పరిణామాలు, ప్రీమియం, టర్మ్‌ పాలసీ, ఎండోమెంట్‌ పాలసీ, మనీ బ్యాక్‌ పాలసీ, పాలసీ బోనస్, మెచ్యూరిటీ వంటి అంశాలపై ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా బీమా రంగ సుస్థిరతకు ప్రభుత్వం చేపడుతున్న విధానాలు, ఐఆర్‌డీఏ, లైఫ్‌ ఇన్సూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటి అంశాలపై అవగాహన పొందాలి. ఫైనాన్షియల్‌ మార్కెట్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలు, బ్యాంకింగ్‌ రంగంలో పరిస్థితులు, ఆర్‌బీఐ నూతన విధానాలు వంటి అంశాలపై పట్టు సాధించాలి.

మెయిన్‌ దృక్పథంతో ప్రిపరేషన్ సాగిస్తే..
ఎల్‌ఐసీ ఏడీఓ నియామక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ రీజనింగ్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అంశాలు కామన్‌గా ఉన్నాయి. ప్రిలిమ్స్‌ అడిగే ప్రశ్నలు ఓ మోస్తరుగా, మెయిన్‌ ఎగ్జామ్‌ ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్‌ దశ నుంచే మెయిన్‌ పరీక్ష దృక్పథంతో అభ్యసనం సాగించాలి. ఫలితంగా ఒకే సమయంలో ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటికీ సన్నద్ధత లభిస్తుంది. మెయిన్‌లో మాత్రమే ఉన్న జీకే, కరెంట్‌ అఫైర్స్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌ అవేర్‌నెస్‌ విభాగాల ప్రిపరేషన్‌ కోసం ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. ప్రతి రోజు కనీసం రెండు గంటలు ఈ అంశాలను అధ్యయనం చేయాలి.
ఒక సారి పాత ప్రశ్న పత్రాలను కూడా..
అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో ఎల్‌ఐసీ ఏడీఓ గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌ పీఓ పరీక్షల పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం మేలు చేస్తుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించిన విభాగంలో అడిగే ప్రశ్నల తీరుపై స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. ఏడీఓ నియామక ప్రక్రియలో విజయం సాధించే అవకాశాలను పెంచుకోవచ్చు.

➤ BPNL Notification: బీపీఎన్‌ఎల్‌లో 2826 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌... పూర్తి వివరాలు ఇవే

ఏడీఓ ఉద్యోగాల‌ ముఖ్య సమాచారం ఇదే..
☛ దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
☛ ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు : జనవరి 21- ఫిబ్రవరి 10,2023
☛ ప్రిలిమినరీ పరీక్ష తేదీ : మార్చి 12, 2023
☛ మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీ : ఏప్రిల్‌ 8, 2023

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్, మెయిన్‌ ఎగ్జామ్‌ కేంద్రాలు ఇవే..: 
హైదరాబాద్, కడప, కరీంనగర్, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, విజయవాడ, గుంటూరు, కాకినాడ, ఏలూరు, నిజామాబాద్, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, చీరాల, ఒంగోలు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://licindia.in/Bottom-Links/Careers/
Recruitment-of-Apprentice-Development-Officer-222
ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://ibpsonline.ibps.in/licadojan23

Published date : 30 Jan 2023 04:09PM

Photo Stories