Skip to main content

Jobs: జస్ట్‌ పది పాస్‌తో 40,889 ఉద్యోగాలు... నాలుగు గంటలే పని.. పూర్తి వివరాలు ఇవే

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు.

ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. 
ఏపీలో 2480, తెలంగాణ‌లో 1266 ఖాళీలు
దేశవ్యాప్తంగా మొత్తం 40,889 పోస్టులు ఉండగా... తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగానికి ఎంపికైతే రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పని ఉంటుంది. ఈ వర్క్‌తో పాటు ఇండియన్‌  పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ అందిస్తారు. విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌ తపాలా శాఖ సమకూరుస్తుంది. సైకిల్‌ తొక్కడం కచ్చితంగా వచ్చి ఉండాలి. 
ప‌దిలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా...
పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టుగా ఉండాలి. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు అలాగే.. 40 ఏళ్లకు మించని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. 

Postal Jobs

జీతం: బీపీఎం పోస్టులకు రూ.12,000–రూ.29,380; ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌ పోస్టులకు రూ.10,000–రూ.24,470 మధ్య వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌  రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్షన్‌ 1 తర్వాత దానికి ఆప్షన్‌ 2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి. దరఖాస్తు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి.

బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలు చూసుకుంటూ... పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌  పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి.

డాక్‌ సేవక్‌: ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్, పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్‌ పథకాలు ప్రచారం చేయాలి.

దరఖాస్తు ప్రారంభం: 27.01.2023.
చివరితేదీ: 16.02.2023.
దరఖాస్తు సవరణలకు అవకాశం: 17.02.2023 నుంచి 19.02.2023 వరకు

Published date : 27 Jan 2023 06:42PM
PDF

Photo Stories