Skip to main content

BPNL Notification: బీపీఎన్‌ఎల్‌లో 2826 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌... పూర్తి వివరాలు ఇవే

భారతీయ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీపీఎన్‌ఎల్‌) భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 2826 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను బట్టి టెన్త్‌, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 2826 ఉన్నాయి. ఇందులో డిగ్రీ విద్యార్హతతో సెంట్రల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు 314 ఖాళీలున్నాయి. వయసు 24–45 ఏళ్ల మధ్య ఉండాలి. స్టార్టింగ్‌ జీతం రూ.18 వేల నుంచి ప్రారంభమవుతుంది. 

12వ తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మొత్తం 628 ఖాళీలు ఉన్నాయి. వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.15 వేలు

BPNL Jobs


అలాగే 12వ తరగతి ఉత్తీర్ణతతో 314 ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.  
వయసు: 21–40 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ట్రైనర్‌ – 942: అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
వయసు: 21–40 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎంటీఎస్‌ – 628: 10వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: 21–30 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 05, 2023  
చ‌దవండి: జస్ట్‌ పది పాస్‌తో 40,889 ఉద్యోగాలు... నాలుగు గంటలే పని..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్‌డ్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 05–02–2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
వివరాలకు http://www.bharatiyapashupalan.com/ సందర్శించండి

Published date : 27 Jan 2023 07:20PM

Photo Stories