Skip to main content

SSC Jobs Notification : 11409 ఉద్యోగాల భ‌ర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తోనే.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్రప్రభుత్వ వివిధ‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ (SSC ) జ‌న‌వ‌రి 18వ తేదీన‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 11409 పోస్టుల భ‌ర్తీకి శ్రీకారం చుట్టింది.
SSC jobs
SSC Jobs Notification 2023

ఇందులో 10,880 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, 529 హవల్దార్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకు జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ విధానం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

☛ SSC CHSL 4500 Vacancies: ఇంటర్‌తోనే కేంద్ర కొలువులు ... నిర్దిష్ట ప్రణాళికతో విజయం‌.. నెలకు రూ.40వేలకు పైగా ...

అర్హ‌త‌లు ఇవే.. : 
పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వ‌యోప‌రిమితి :  
2023 జ‌న‌వ‌రి 1వ తేదీ నాటికి 18-25 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. 02.01.1998 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. అలాగే కొన్ని పోస్టులకు 18-27 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. 02.01.1996 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

☛ 24,369 Constable Jobs In SSC: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

ఎంపిక విధానం : 

11409 ssc exam details in telugu

కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు మొదటిసారి రూ.200, రెండోసారి అయితే  రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

☛ Success Story : వరుసగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టానిలా.. ఇలా చదవడం వ‌ల్లే..

ముఖ్యమైన తేదీలు ఇవే..

11409 ssc jobs exam dates

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ : జ‌న‌వ‌రి 18, 2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది : ఫిబ్ర‌వ‌రి 17, 2023
ఫీజు చెల్లించడానికి చివరితేది : ఫిబ్ర‌వ‌రి 19, 2023
రాతపరీక్ష తేది: ఏప్రిల్, 2023.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే : 
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం

ఈ మాధ్యమాల్లో ప‌రీక్ష‌..

ssc exam latest news

మొత్తం 15 భాషల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.

పరీక్ష విధానం ఇలా.. :

11409 ssc jobs exam pattern in telugu

మొత్తం 270 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు.  120 మార్కులకు మొదటి సెషన్, 150 మార్కులకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు.

మొదటి సెషన్‌లో మాత్రం..
మొదటి సెషన్‌లో న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & ప్రాబ్లం సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.

మొదటి సెషన్‌లో ఇలా..
రెండో సెషన్‌లో జనరల్ అవెర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్-30%, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25%, ఇతరులకు-20%  గా నిర్ణయించారు.

☛ ఎస్ఎస్‌సీ 11409 ఉద్యోగాల రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ, జనరల్ అవెర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్, రీజినింగ్ ఎబిలిటీ & ప్రాబ్లం సాల్వింగ్ మొద‌లైన వాటికి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

11409 SSC Jobs Notification 2023 Details PDF :

Published date : 19 Jan 2023 06:04PM
PDF

Photo Stories