SSC GD Exam 2025 Answer Key : ఎస్ఎస్‌సీ జీడీ ఆన్సర్ కీపై అప్‌డేట్.. డౌన్‌లోడ్ విధానం ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్: ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమై 25వ తేదీన పూర్తి అయిన ఎస్ఎస్‌సీ జీడీ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ త్వరలోనే విడుదల కానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెలలో నిర్వహించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జీడీ కానిస్టేబుల్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ కోసం వేచి చూస్తున్నారు. త్వరలోనే అధికారికంగా, ssc.gov.in. వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ కు సంబంధించిన లింక్‌ను ప్రకటిస్తారు అధికారులు. దీంతో, పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ లింక్‌తో ఆన్సర్ కీ ని పరిశీలించుకునేందుకు వెబ్‌సైట్ నుంచి ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అభ్యంతరాలకు అవకాశం..
ఇటీవల పూర్తి అయిన పరీక్షల ఆన్సర్ షీట్లు త్వరలోనే విడుదల అవుతాయని అధికారులు వెల్లడించారు. అయితే, అభ్యర్థులు ఈ లింక్ ఆక్టివేట్ అయిన తరువాత, మీ జవాబులను పరిశీలించుకుని, ఏదైనా అభ్యంతరాలుంటే, వెంటనే స్పందించవచ్చు. అంటే, ఎస్ఎస్‌సీ జీడీ 2025 పరీక్షకు సంబంధించిన జవాబు కీతో పాటు, కీ అభ్యంతర విండోను కూడా అందిస్తుంది కమిషన్, దీంతో, అభ్యర్థులు ఏవైనా వ్యత్యాసాలను సవాలు చేయడానికి వీలు కల్పిస్తుంది.
డైరెక్ట్ జవాబు కీ డౌన్‌లోడ్ లింక్, ప్రతిస్పందన షీట్ యాక్సెస్, అభ్యంతర సమర్పణ వివరాల కోసం అప్‌డేట్‌గా ఉండండి. ఈ అభ్యంతరాలను వ్యక్తపరిచేందుకు గడువును ప్రకటిస్తారు అధికారులు, ఆ గడువు ముగిసేలోగా, మీకు ఉన్న అభ్యంతరాలను ప్రకటించిన విధంగా తెలపాలి.
ఆన్సర్ కీ డౌన్‌లోడ్ విధానం:
1️⃣ మొదట.. ఎస్ఎస్‌సీ (SSC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.. ssc.gov.in
2️⃣ ఎస్ఎస్‌సీ జీడీ ఆన్సర్ కీ 2025పై క్లిక్ చేయండి.
3️⃣ ssc.digialm.com లింక్‌పై క్లిక్ చేయండి.
4️⃣ అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
5️⃣ ఇక, మీ ఎస్ఎస్‌సీ జీడీ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్, క్వశ్చన్ పేపర్ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ssc gd exam 2025
- february exams
- ssc gd answer key latest update
- ssc gd constable exam 2025
- Competitive Exams
- ssc competitive exams latest updates
- answer key release date for ssc gd constable exam
- ssc exams 2025
- objection window for ssc gd constable exam 2025
- response sheet and answer key for ssc gd exam
- SSC GD Constable Initial Key
- SSC GD Constable Question Paper
- download process for ssc gd constable exam
- SSC GD Constable Answer Key Download Process
- objection window for ssc gd constable answer key 2025
- Education News
- Sakshi Education News
- SSCGD results
- SSC GD answer key updates