Skip to main content

Jobs: JLM పోస్టుల భర్తీకి కసరత్తు

నల్లగొండ: విద్యుత్‌ శాఖలో జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం)ల నియామకానికి ఆ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పోల్‌ క్‌లైంబింగ్‌, సర్టిఫికెట్ల పరిశీలన కోసం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు.
Jobs
JLM పోస్టుల భర్తీకి కసరత్తు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 335 జేఎల్‌ఎం పోస్టులను భర్తీ చేసేందుకు 1.2 నిష్పత్తిలో అభ్యర్థులను పోల్‌ క్లైంబింగ్‌ టెస్టుకు ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా అభ్యర్థులకు పోల్‌ క్‌లైంబింగ్‌ పరీక్ష నిర్వహించి అదే రోజు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను జేఎల్‌ఎం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

చదవండి: Jobs: 64పోస్టులు.. 45ఖాళీ

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు, పరీక్ష తేదీలు ఇలా..

  • నల్లగొండ జిల్లాలో 134 జేఎల్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం 268 మంది అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలిచారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న డీఈ కార్యాలయంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో అభ్యర్థులకు పోల్‌ క్లైంబింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం టెస్ట్‌లో పాసైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆయా తేదీల్లోనే పరిశీలిస్తారు.
  • సూర్యాపేట జిల్లాలో మొత్తం 110 పోస్టులు ఉండగా 1:2 నిష్పత్తిలో 220 మంది అభ్యర్థులను పోల్‌ కై ్లంబింగ్‌ టెస్ట్‌కు ఆహ్వానించారు. సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో పోల్‌ క్లైంబింగ్‌ టెస్టులు నిర్వహించిన అనంతరం వారి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.
  • యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మొత్తం జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు 91 ఖాళీగా ఉండగా 1:2 నిష్పత్తి ప్రకారం 183 మందిని పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌కు పిలిచారు. వీరందరికి సెప్టెంబర్‌ 4, 5 తేదీల్లో టెస్ట్‌ నిర్వహించి వారి సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు.

ఎంపిక కమిటీ నియామకం..

పోల్‌ క్లైంబింగ్‌ పరీక్షలో పాల్గొనే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇప్పటికే ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో పోల్‌ క్లైంబింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఈ ఎంపిక కమిటీ చైర్మన్‌గా సీజీఎం పాండ్యా, ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా నల్లగొండ ఎస్‌ఈ టీఆర్‌.చంద్రమోహన్‌, సభ్యులుగా నల్లగొండ డీఈ (టెక్నికల్‌) రవికాంత్‌శర్మతో పాటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాల డీఈలను నియమించారు. అదేవిధంగా కార్యదర్శిగా అసిస్టెంట్‌ సెక్రటరీ రవీంద్రనాథ్‌ వ్యవహరించనున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోల్‌ క్లైంబింగ్‌ నిర్వహించిన తర్వాత అందుకు సంబంధించిన ఫలితాలను విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులకు పంపనున్నారు.

Published date : 11 Aug 2023 04:36PM

Photo Stories