Jobs: మహిళాశిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
తుమ్మపాల: మహిళా శిశు సంక్షేమశాఖలో జిల్లా కోఆర్డినేటర్, ప్రాజెక్టు అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ కె.అనంతలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.
మొదటి రెండు ఉద్యోగాలకు ఎంపికైన వారు అనకాపల్లిలోను, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుకు ఎంపికైనవారు రావికమతంలో పనిచేయవలసి ఉంటుందన్నారు.
చదవండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
- జిల్లా కోఆర్డినేటర్ పోస్టుకు అర్హతలు: 25– 40 ఏళ్ల మధ్య వయసు గల డిగ్రీ (కంప్యూటర్ సైన్‌న్స్)లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అప్లికేషన్ మెయింటెన్స్ అండ్ సపోర్ట్‌లో రెండు సంవత్సరాల అనుభవం, స్థానిక భాషలో చక్కగా మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి, ఫీల్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. స్థానికులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ప్రాజెక్టు అసిస్టెంట్ : 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల వారు అర్హులు. కెపాసిటీ బిల్డింగ్‌లో రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం, స్థానిక భాషలో మాట్లాడడం, రాయడంతో పాటు ఇంగ్లిషులో కూడా ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- బ్లాక్ కోఆర్డినేటర్ : 25 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లో రెండు సంత్సరాల అనుభవం, స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం. ఈ ఉద్యోగాలు సంవత్సర (12 నెలలు) కాలపరిమితికి మాత్రమే భర్తీ చేస్తామని తెలిపారు. బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టును ఓసీ మహిళా అభ్యర్థులకు కేటాయించినట్టు పేర్కొన్నారు. దరఖాస్తుఫారం పూర్తి వివరాలు ఏఎన్‌ఏకెఎిపిఏఏల్‌ఏల్‌ఐ.ఎపి.ఎన్‌ఐసి.ఐఎన్ వెబ్‌సెట్‌లో లభ్యమవుతాయి. అర్హత ధ్రువీకరణపత్రాల నకళ్లపై గెజిటెడ్ అధికారి అటస్టేషన్ చేయించి, పూర్తిచేసిన దరఖాస్తుతో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం, ప్లాట్ నంబర్ 3, నూకాలమ్మ గుడి రోడ్డు గవరపాలెం, అనకాపల్లి చిరునామాలో ఈ నెల 14వ తేదీలోపు చేరవేయాలి.
Published date : 04 Dec 2023 02:22PM