Skip to main content

AP Grama/Ward Sachivalayam Employees New Salary : గ్రామ/వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. వీరికి కొత్త‌ పే స్కేలు ఇలా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలను రెండో విడత నోటిఫికేషన్‌ ద్వారా పొందిన వారికి కూడా ప్రొబేషన్‌ ఖరారు చేస్తూ ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభు­త్వం ఏప్రిల్ 17వ తేదీన (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది.
AP Grama/Ward Sachivalayam Employees New Salary telugu news
AP Grama/Ward Sachivalayam Employees New PayScale Details

శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్‌ వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

☛ AP గ్రామ, వార్డు సచివాలయ బెస్ట్ బుక్స్ ఇవే..| సిల‌బ‌స్ ఇదే..| ఈ ఉద్యోగాల‌కు ఎలా చ‌ద‌వాలి..?

మే 1 నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020 సం­వత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా ఉ­ద్యో­గాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు. ప్రొబేషన్‌ ఖరా­రు అనంతరం దాదాపు రెట్టింపు జీతం అందుకుంటారు.

కొత్త జీతాలు ఇలా..

ap grama/ward sachivalayam employees salary details in telugu

గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రొబే­షన్‌ ఖరారైన గ్రేడ్‌ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్టేటివ్‌ సెక్రటరీలు ఇప్పుడు కనీస బేసిక్‌ వేతనం రూ.23,120 కాగా, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత రూ. 29,598 అందుకుంటారు. మిగిలిన 17 విభాగాల ఉద్యోగులు ఇప్పుడు కనీస బేసిక్‌ వేతనం రూ.22,460కు డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ. 28,753 అందుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి.

☛ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ప్రొబేషన్‌ ఖరారు ప్రక్రియ ఇలా..

ap grama/ward sachivalayam employees news telugu

పట్టణ ప్రాంతాల్లో హెచ్‌­ఆర్‌ఏ స్లాబు ప్రకారం కొంత మందికి కొంచెం ఎక్కువ వేతనం వస్తుంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి (అంటే జూన్‌ ఒకటిన ఉద్యోగులకు అందే జీతం) అమలులోకి వస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రొబేషన్‌ ఖరారు ఉత్తర్వుల విడుదల నేపథ్యంలో.. జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్‌మెంట్‌ టెస్టులో ఉత్తీర్ణత సాధించి, ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసు రిపోర్టుల్లో తేలిన వారికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రొబేషన్‌ ఖరారు ప్రక్రియ కొనసాగుతుంది.

☛ AP Grama Sachivalayam Syllabus 2023 : గ్రామ‌/వార్డు స‌చివాల‌య రాత‌ప‌రీక్ష ఉమ్మ‌డి సిల‌బ‌స్ ఇదే.. వీటిపై ప‌ట్టు ఉంటే.. జాబ్ మీదే..

1,26,728 ఉద్యోగుల‌కు..

AP Grama sachivalayam news 2023

సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన రోజునే ప్రజల గడపవద్దకే ప్రభుత్వపాలన తీసుకొచ్చేందు­కు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రక­టించారు. దీని ద్వారా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) విధానంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో మరో 9,600 ఎనర్జీ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 2019 జూలైలో నోటిఫికేషన్‌ జారీచేశారు.

☛ Andhra Pradesh: 63 CDPO ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌.. అలాగే ఈ పోస్టుల‌ను కూడా..

నిబంధల ప్రకారం.. 

ap grama/ward sachivalayam telugu news

నాలుగు నెలల్లో­నే రాత పరీక్షలు, నియామక ప్రక్రియ పూర్తిచేశారు. పంచాయతీరాజ్‌శాఖ నోటి­ఫికేషన్‌ ద్వారా 1,05,497 మంది ఉద్యోగాలు పొందగా.. అందులో నిబంధల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్‌మెంట్‌ టెస్టు పాసైన 1,00,724 మంది (ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా)కి గత ఏడాది జూన్‌ నెలాఖరుకే ప్రభుత్వం ప్రొబేషన్‌ ఖరారు చేసింది. 

వారందరికీ గత ఏడాది జూలై ఒకటి నుంచి పే–స్కేలుతో కూడిన వేతనాలను ఇస్తోంది. మొదటి విడత నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులకు వెంటనే 2020లో నోటిఫికేసన్‌ జారీ చేయగా, మరో 12,837 మంది ఉద్యోగాలు పొందారు. వీరు ఇప్పుడు ప్రొబేషన్‌ పొంది మే 1 నుంచి పే స్కేలుతో కూడిన వేతనాలు అందుకోబోతున్నారు. మొదటి విడత ఉద్యోగుల్లో మిగిలినవారు నిబంధనల ప్రకారం అర్హత పొందిన వెంటనే ప్రొబేషన్‌ పొందుతారని అధికారులు వెల్లడించారు.

Andhra Pradesh: గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల.. శాల‌రీ ఎంతంటే..?

పే స్కేలులో మార్పులు ఇలా.. 

ap grama/ward sachivalayam employees salary details in telugu

గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శులకు రూ.22,120 - రూ.74,770పే స్కేలును అమలు చేయనున్నారు. డిజిటల్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, గ్రేడ్‌-2 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, హార్టికల్చర్‌ అసిస్టెంట్, సెరికల్చర్‌ అసిస్టెంట్, విలేజ్‌ సర్వేయర్, వీఆర్వో, వెల్ఫేర్‌ అసిస్టెంట్ల వేతన శ్రేణి రూ.22,460 - రూ.72,810 మధ్య ఉండనుంది. వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీకి ఉద్యోగులకు రూ.23,120 - రూ.74,770 వేతనం చెల్లించగా.. మిగిలిన వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్‌-డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులరైజేషన్‌ సెక్రటరీ, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలకు పే స్కేలు రూ. 22,460- రూ.72,810 మధ్య ఉండనుంది.

➤ AP CM YS Jagan Mohan Reddy : గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీకి ఆదేశం.. ఇంకా అంగన్‌వాడీలను కూడా..

సీఎం జగన్‌ రుణం తీర్చుకుంటాం.. 

ap grama/ward sachivalayam employees news telugu

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండోవిడత ఉ­ద్యో­గాలు పొందిన వారికీ ప్రొబేషన్‌ ఖరారు చేసి­నందుకు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రభుత్వానికి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి జగన్‌కున్న అభిమానానికి ఈ నిర్ణయాలే నిదర్శనమని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా సచివాలయాల ఉద్యోగులు కష్టపడి పని చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రుణం తీర్చుకుంటారని చెప్పారు.

☛ AP Grama/Ward Sachivalayam : ఈ మార్కుల ఆధారంగానే.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు..

మే 1వ తేదీ నుంచి అమలయ్యే కొత్త జీతాలు ఇలా..

ap grama/ward sachivalayam employees salary details
Published date : 18 Apr 2023 11:17AM

Photo Stories