Skip to main content

Andhra Pradesh: 63 CDPO ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌.. అలాగే ఈ పోస్టుల‌ను కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : మహిళా, శిశు సంక్షేమ శాఖపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జ‌న‌వ‌రి 10వ తేదీన (మంగళవారం) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష స‌మావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.
AP CM YS Jagan
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అలాగే 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు.

☛ ఇలా ప్రిపేర్ అయితే ' CDPO ' ఉద్యోగం మీదే..

అంగన్‌వాడీలలోలను..
అంగన్‌వాడీలలో బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. అంగన్వాడీలలో స్మార్ట్‌ టీవీల ద్వారా డిజిటల్‌ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేసి, ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచించారు. అంగన్‌వాడీలలో, ప్రభుత్వ బడులలో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఈ వర్గాలకు చెందిన పిల్లలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంద‌న్నారు. వారి పట్ల సానుకూల దృక్పథంతో పనిచేయాల‌న్నారు. 10–12  ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టిందని సీఎం అన్నారు.

☛➤ CDPO ఉద్యోగాలు ప్రత్యేకం | CDPO Previous Questions Analysis | Part-1

☛➤ CDPO ఉద్యోగాలు ప్రత్యేకం | CDPO Previous Questions Analysis | Part-2

☛➤ CDPO ఉద్యోగాల ప్రత్యేకం | ఆహార శాస్త్రం & పోషణ- 01 | Food Science & Nutrition

Published date : 10 Jan 2023 08:25PM

Photo Stories