Jobs: గురుకుల కొలువుల ’దరఖాస్తు’లు మొదలు!
జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో వివిధ రకాల పోస్టులకు గానూ తాజాగా ఆన్‌లైన్ దరఖాస్తులకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏప్రిల్ 17 నుంచి అనుమతిచ్చింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి వరుసగా మిగిలిన ఉద్యోగాల దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది.
చదవండి: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రంలోని ఐదు గురుకుల సొసైటీల పరిధిలో 9,231 ఉద్యోగాలకు సంబందించి ఏప్రిల్ 5వ తేదీన గురుకుల నియామకాల బోర్డు ఏకంగా 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా దరఖాస్తు ప్రక్రియను నెలరోజుల పాటు కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన బోర్డు... ముందుగా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలకు గాను దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ కేటగిరీలకు సంబంధించిన పూర్తిస్థాయి ఉద్యోగ ప్రకటనలను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. రోస్టర్ వారీగా ఉద్యోగ ఖాళీలు, దరఖాస్తు ప్రక్రియ, విద్యార్హతలు, ఫీజు, పరీక్షల సిలబస్, పరీక్షల విధానం(స్కీం ఆఫ్ ఎగ్జామినేషన్) తదితర పూర్తిస్థాయి సమాచారాన్ని అందులో పొందుపర్చింది.
చదవండి: OU: డాక్టరేట్ అందుకున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
ఓటీఆర్ కీలకం:
గురుకుల కొలువుల దరఖాస్తులో ఓటీఆర్(వన్ టైమ్ రిజి్రస్టేషన్)ను టీఆర్‌ఈఐఆర్‌బీ కీలకం చేసింది. దీంతో అభ్యర్థులంతా ముందుగా ఓటీఆర్ నమోదు చేసుకున్న తర్వాత దరఖాస్తు పేజీలోకి ఎంట్రీ కావాలి. దీంతో ఒకవైపు ఓటీఆర్ నమోదు చేసుకునే అభ్యర్థులు... మరోవైపు దరఖాస్తు సమరి్పంచే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వెబ్‌పేజీని తెరుస్తుండడంతో సర్వర్‌పై ఒత్తిడి తీవ్రమైంది. దీంతో వెబ్‌పేజీ తెరుచుకోవడంలో జాప్యం జరుగుతుండటంతో అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు కావడంతో కాస్త ఇబ్బందులున్నప్పటికీ నాలుగైదు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని బోర్డు అధికారులు చెబుతున్నారు.
చదవండి: ప్రధాని మోదీతో ఎస్సీ,ఎస్టీ గురుకుల విద్యార్థులు
దరఖాస్తు రుసుము రూ.1200:
గురుకుల ఉద్యోగాల దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు ఒక్కో దరఖాస్తు ఫీజు రూ.600 చొప్పున చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలుంటే బోర్డు ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ నంబర్‌ను సంప్రదించవచ్చు. 040–23317140 ఫోన్ నంబర్‌లో నేరుగా కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని టీఆర్‌ఈఐఆర్‌బీ సంప్రదించింది. లేకుంటే టీఆర్‌ఈఐఆర్‌బీహెల్ప్‌లైన్(ఎట్)జీమెయిల్.కామ్ కు లిఖిత పూర్వక ఫిర్యాదులు, వినతులు సమరి్పంచవచ్చని బోర్డు సూచించింది.