ప్రధాని మోదీతో ఎస్సీ,ఎస్టీ గురుకుల విద్యార్థులు
సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలకు చెందిన 14 మంది విశాఖ జిల్లా విద్యార్థులు, 13 మంది వైఎస్సార్ జిల్లా విద్యార్థులు స్టడీ టూర్‌లో భాగంగా ఢిల్లీకి తీసుకెళ్లారు. మార్చి 16 సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించి, వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు.
చదవండి: Narendra Modi: 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’
మార్చి 17న ఢిల్లీలోని పార్లమెంట్ పరిసర ప్రాంతాలు, విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థుల వెంట పెందుర్తి, గాజువాక హెచ్‌డబ్ల్యూవోలు ఎ.సత్యవతి, కె.అలివేలు మంగ, వైఎస్సార్ జిల్లా హెచ్‌డబ్ల్యూవోలు నాగరాజునాయక్, పద్మజ, ఉన్నారు. వసతి గృహాల్లోని ప్రతిభ కలిగిన విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలనే తలంపుతోనే ప్రభుత్వం, వివిధ సంస్థల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డి.వి.రమణమూర్తి తెలిపారు.
చదవండి: PM- SYM: ఇలా చేస్తే నెలకు రూ.3 వేల పెన్షన్... పూర్తి వివరాలు ఇవే