PM- SYM: ఇలా చేస్తే నెలకు రూ.3 వేల పెన్షన్... పూర్తి వివరాలు ఇవే
ముఖ్యంగా రూ.15,000 లోపు నెలవారీ ఆదాయం ఉన్న టైలర్లు, చెప్పులు కుట్టేవాళ్లు, రిక్షా పుల్లర్లు, ఇంటి కార్మికులకు 60 ఏళ్ల దాకా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
18 నుంచి 60 ఏళ్ల మధ్యనున్న వారే....
వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు పెన్షన్ ప్రయోజనాలను అందించడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి మంధన్ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి కార్మికుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ వస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే వారు, నెలవారీ ఆదాయం రూ. 15,000 కంటే తక్కువ ఉన్నవారు ఈ పథకాని అర్హులు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి వయసు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
చదవండి: మన పిల్లలు ఎక్కడికి వెళ్లినా గెలవగలగాలి: వైఎస్ జగన్
నెలకు రూ.55 నుంచి రూ.200 కట్టాలి
కార్మికుల సహకారం ఆధారంగా ఈ పెన్షన్ లభిస్తుంది. ఇందుకోసం ప్రతి నెలా రూ.55 నుంచి రూ. 200 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 50 శాతం లబ్ధిదారుడు, 50 శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. ఒక వేళ పింఛనుదారుడు(భార్య/భర్త) మరణిస్తే పెన్షన్ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి
ఆన్ లైన్, ఆఫ్‌లైన్ లో రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మన్ ధన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫాం నింపిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటిపీని ఎంటర్ చేస్తే చాలు. ఆఫ్‌లైన్ ద్వారా అయితే కామన్ సర్వీస్ సెంటర్‌లో వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారు, EPFO, NPS, NSIC సబ్‌స్క్రైబర్లు ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు.