Skip to main content

Women Empowerment: మహిళా శక్తితో సాధికారత

ఎస్సీ, ఎస్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఉన్నతి–మహిళా శక్తి అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది.
Women Empowerment scheme in AP

ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ మహిళల జీవనోపాధికి సున్నా వడ్డీకే ఆటో రిక్షాలు అందిస్తోంది. ఆటోలో నడుపుకోవడం ద్వారా రోజువారీ ఆదాయం పొంది తమ కాళ్ల పై తాము నిలబడేందుకు పథకం దోహదం చేస్తోంది. లబ్ధిదారులపై ఎటువంటి భారం లేకుండా సులభ వాయిదాల్లో రుణాలు చెల్లించుకుంటూ వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

Har Shikhar Tiranga: సీతమ్మ కొండపై ‘హర్‌ శిఖర్‌ తిరంగా’

లబ్ధిదారుల ఎంపిక ఇలా..

సెర్ప్‌ ఉన్నతి విభాగం ద్వారా మహిళలకు శక్తివంతమైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం మహిళా శక్తి ఆటోరిక్షా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను లబ్ధిదారుల ఎంపికకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కొందరు తమ వాటా ధనాన్ని చెల్లించారు. డిసెంబర్‌ నెలలో ఎంపికై న లబ్ధిదారులకు ప్రభుత్వం ఆటో రిక్షాలు పంపిణీ చేయనుంది. ఈ ఏడాది జిల్లాలో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 చొప్పున ఆటో రిక్షాలు కేటాయించాలని నిర్ణయించారు. అయినప్పటికీ దరఖాస్తుల సంఖ్యను బట్టి అర్హులందరికీ ఆటో రిక్షాల కొనుగోలుకు రుణాలు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. జగ్గయ్యపేటకు చెందిన ఇద్దరు, పెనుగంచిప్రోలు మండలానికి చెందిన ముగ్గురు పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు.

YSR Kalyana Mastu, YSR Shaadi Tohfa: వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులు విడుద‌ల‌

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండాలి.
●లబ్ధిపొందే మహిళ మయస్సు 20 నుంచి 45 సంవత్సరాలు లోపు ఉండాలి.
●తప్పనిసరిగా తగిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
●లబ్ధిదారురాలు డ్రైవింగ్‌ చేస్తున్నట్లు ఒక నిమిషం వీడియో పెట్టాలి.
●ఆటో కొనుగోలు సమయంలో లబ్ధిదారులు 10 శాతం వాటా ధనాన్ని ఎస్‌హెచ్‌జీ బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాలి. మిగిలిన మొత్తం రుణంగా అందిస్తారు.
●గ్రామీణ ప్రాంతంలో నివసించే మహిళలు పథకానికి అర్హులు.
●లబ్ధిదారులే తమకు కావాల్సిన ఆటోరిక్షా మోడల్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. (అంటే పాసింజర్‌ ఆటో, ట్రాలీ ఆటో, డీజిల్‌, గ్యాస్‌ ఆటో, కంపెనీ, మోడల్‌ వివరాలన్నీ లబ్ధిదారులు లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.)
●ఎస్‌హెచ్‌జీ, వీఓ తీర్మానం తప్పనిసరిగా ఉండాలి.
●లబ్ధిదారులే రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఇతర ఖర్చులు భరించాల్సి ఉంటుంది.
●45 నిర్ణీత వాయిదాలలో వడ్డీ లేని అప్పు గ్రామసంఘం ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
●లబ్ధిదారులు ఆటోరిక్షా కంపెనీ ఇచ్చే శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. మైనర్‌ రిపేర్లు ఏ విధంగా చేయాలో నిపుణులు శిక్షణనిస్తారు.

Fishing Harbour in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌

Published date : 01 Nov 2023 05:23PM

Photo Stories