Fishing Harbour in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట వద్ద దీనిని ఏపీ మారిటైమ్ బోర్డు నిర్మించనుంది. రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతం 974 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 555 మత్స్యకార గ్రామాలకు చెందిన 6.3 లక్షల మంది మత్స్యకార కుటుంబాలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,520 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Solar Parks In AP: ఆంధ్రప్రదేశ్‌లో సోలార్‌పార్కులు
ఇందులో తొలి దశలో రూ.1,522.8 కోట్లతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నాలుగు హార్బర్లను వచ్చే డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రెండో దశలో రూ.1,997.77 కోట్లతో నిర్మిస్తున్న బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్ప, వోడరేవు ఫిషింగ్ హార్బర్ల పనులు ఇటీవలే మొదలయ్యాయి.
AP Maritime Board: పర్యాటక ప్రదేశాలుగా ఏపీ ఫిషింగ్ హార్బర్లు
ఫిష్ ల్యాండ్ సెంటర్: చిన్న పడవలు, ఇంజిన్ బోట్లు నిలుపుకోవడానికి, చేపలు ఆరబెట్టుకునేందుకు అవకాశం. రూ.10 కోట్ల ఖర్చుతో నిర్మాణం.
ఫిషింగ్ హార్బర్: పెద్ద బోట్లు నిలుపుకునేందుకు బెర్త్‌లు, జెట్టీల నిర్మాణం. చేపల స్టోరేజ్‌కు అవకాశం. నిర్మాణ ఖర్చు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ ఆగే బోట్లు సముద్రంలో చాలా దూరం వెళ్లగలవు. ఒక్క మాటలో చెప్పాలంటే మినీ పోర్ట్.
Software Technology Parks in AP: ఏపీలో 4 సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ కేంద్రాలు