Skip to main content

AP Maritime Board: పర్యాటక ప్రదేశాలుగా ఏపీ ఫిషింగ్‌ హార్బర్లు

ఏపీ మారిటైమ్‌ బోర్డు  ఫిషింగ్‌ హార్బర్లు కేవలం చేపల వేటకే పరిమితం కాకుండా పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతున్నారు.
AP-Maritime-Board
AP Maritime Board

వాటి పక్కనే రిసార్టులు, వెల్‌నెస్‌ సెంటర్లు, వాటర్‌ పార్క్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ఏపీ మారిటైమ్‌ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటకుల డిమాండ్‌ అధికంగా ఉన్న హార్బర్లను పరిశీలించి అక్కడ పర్యాటక అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్లలో మచిలీపట్నం వద్ద పర్యాటక అవకాశాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. అలాగే ఫిషింగ్‌ హార్బర్లలో పట్టే చేపలను ప్రోసెసింగ్‌ చేయడం ద్వారా ఆదాయం తెచ్చేందుకు ఏర్పా­ట్లూ చేస్తోంది. తొలి దశ ఫిషింగ్‌ హార్బర్ల పనులు పూర్తి కావస్తుండటంతో పీపీపీ విధానంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రతి ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఇంటిగ్రేటెడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో టూనా చేపలు, రొయ్యల కోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తారు. 

waterways on rivers for transportation: కాలువల ద్వారా పోర్టులకు సరుకు రవాణా

Published date : 16 Aug 2023 05:50PM

Photo Stories