Skip to main content

Free training for women: మహిళలకు ఉచిత శిక్షణ

Free training for women  Women participating in chocolate-making training at YSR Horticultural University
Free training for women

మహిళలు స్వయం సమృద్ధి ద్వారా ఆర్ధికంగా పరిపుష్టం కావాలని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యానవర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ టి.జానకీరామ్‌ పిలుపునిచ్చారు.భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద విడుదల చేసిన నిధులతో ఉద్యానవర్సిటీలో స్వచ్ఛ చాక్లెట్ల తయారీ మార్కెటింగ్‌పై 60 రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది.

అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కలిగేలా, వారి పరపతి పెరిగేలా తగిన నైపుణ్యశిక్షణను ఉద్యానవర్సిటీ నిర్వహిస్తోందన్నారు. ఇంతవరకు ఎండుపూలతో అలంకరణ వస్తువుల తయారీ, తేనె పట్టు నుంచి తయారుచేసిన వివిధ ఉత్పత్తులు తదితరాలపై శిక్షణ, మార్కెటింగ్‌ సౌకర్యాల గురించి వివరించామన్నారు.

జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, ఆవపాడు, తెలికిచర్ల, పెద తాడేపల్లి, ప్రకాశరావుపాలెం, సింగరాజుపాలెం గ్రామాలకు చెందిన 200 మందికి చాక్లెట్ల తయారీపై అవగాహన కల్పించారు. 25 మంది మహిళలకు 45 రోజుల పూర్తిస్థాయి శిక్షణ నిచ్చారు. 12.7 లక్షల గ్రాంటును ఈ శిక్షణ కోసం ఐసీఏఆర్‌ ఇచ్చింది. డాక్టర్‌ కల్పన, డాక్టర్‌ మాధవి, ఉద్యాన వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

Published date : 02 Dec 2023 08:04AM

Photo Stories