Skip to main content

Gurukulam School Admissions: గురుకులం పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

Class 5 Admissions Open    Intermediate First Year Admissions    Apply Now for Gurukulam COE for Girls   Gurukulam School Admissions news   Dr. BR Ambedkar Gurukulam COE for Girls Admissions
Gurukulam School Admissions news

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం బాలికల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ)లో 5వ తరగతి, ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ టి.నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు.

5వ తరగతిలో 80, ఇంటర్‌లో 80 చొప్పున సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

5వ తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సెప్టెంబర్‌ 1, 2011 నుంచి 31 ఆగస్టు 2015 మధ్య జన్మించినవారై ఉండాలన్నారు. బీసీ కన్వర్టడ్‌ క్రిస్టియన్‌(బీసీసీ), ఓసీకి చెందిన వారు 1 సెప్టెంబర్‌ 2013 నుంచి 31 ఆగస్టు 2015 మధ్య జన్మించిన వారై ఉండాలన్నారు. తండ్రి లేదా సంరక్షకుని ఆదాయ పరిమితి ఏడాదికి లక్ష మించి ఉండకూడదని పేర్కొన్నారు.

ప్రవేశ పరీక్ష ఐదో తరగతికి వచ్చేనెల 10న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్‌కు అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.

మరిన్ని వివరాలకు ఫోన్‌ నంబర్లు 95509 64542, 92460 49529, 81868 97867లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ నాగమణి కోరారు.

Published date : 07 Feb 2024 02:32PM

Photo Stories