Skip to main content

Free training in software developer course: సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కోర్సులో ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటుగా శిక్షణను విజయ వంతంగా పూర్తి చేసిన వారికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి సర్టిఫికెట్‌తో పాటుగా జిల్లా పరిధిలోని ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు.
 Job offer letter from private company   Free training in software developer course   Certificate from Andhra Pradesh State Skill Development Corporation
Free training in software developer course

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఇంటర్‌, డిప్లమో, డిగ్రీ విద్యార్హతలు ఉన్న వారికి జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కోర్సులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

పది, ఐటీఐ విద్యార్హతలున్న వారికి ఫోర్‌ వీలర్‌ సర్వీస్‌ టెక్నీషిన్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. 

● నందిగామలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో 5 నుంచి 10వ తరగతి విద్యార్హత ఉన్న మహిళలకు స్వీయింగ్‌ మెషిన్‌ ఆపరేటర్‌, డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 

● విజయవాడ మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూనియర్‌ సాప్ట్‌వేర్‌ డవలపర్‌ కోర్సులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పది, ఇంటర్‌తో పాటుగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

● విజయవాడ విద్యాధరపురంలోని కబేళా దగ్గర ఉన్న నేషనల్‌ అకాడమీ సెంటర్‌లో ఐటీఐ విద్యార్హత ఉన్న వారికి అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌, స్వీయింగ్‌ మెషిన్‌ ఆపరేటర్‌ కోర్సులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 

● ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలోని డాక్టర్‌ ఎల్‌హెచ్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్‌ పైన విద్యార్హతలు ఉన్న వారికి అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 

● జగ్గయ్యపేటలోని ఎస్‌జీఎస్‌ కళాశాల ఆవరణలో పదో తరగతి పైన విద్యార్హతలు ఉన్న వారికి డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 

జనశిక్షణ సంస్థాన్‌ ఆధ్వర్యంలో...

● విజయవాడ మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్‌లోని జనశిక్షణ సంస్థాన్‌ ఆధ్వర్యంలో కటింగ్‌ అండ్‌ టైలరింగ్‌, డ్రస్‌ డిజైనింగ్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, మిర్రర్‌ వర్క్‌, హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ, మెషిన్‌ ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రీకల్‌ టెక్నిషియన్‌, ఏసీ, రిఫ్రిజరేషన్‌ రిపేరింగ్‌, ఐస్‌క్రీమ్‌ మేకింగ్‌, స్క్రీన్‌ ప్రింటింగ్‌, జామ్‌ అండ్‌ జ్యూస్‌ తయారు చేయడం, భాతిక్‌ ప్రింటింగ్‌, హోమ్‌ క్రాప్ట్స్‌ మేకింగ్‌, మిర్రర్‌ వర్క్‌ మొదలైన అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు విజయవాడ మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్‌లోని తమ సంస్థ కార్యాలయంలో నేరుగా కానీ 0866–2470420 నంబరులో కానీ సంప్రదించవచ్చు.

శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు

Published date : 08 Feb 2024 12:16PM

Photo Stories