Skip to main content

Teacher Posts: 2217 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌

Teacher Posts   DSC Notification   Educational Opportunity   Statewide Teacher Recruitment
Teacher Posts

రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల్లో సింహభాగం ఉమ్మడి కర్నూలు జిల్లాకు దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యలో 4,057 టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫై చేశారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 2,217 పోస్టులు నోటిఫై అయ్యాయి. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో 2008 డీఎస్సీ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,683 పోస్టులు భర్తీ అయ్యాయి.

నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో 2,217 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంది.

ఇందులో భాగంగా 2008 డీఎస్సీలో అర్హత పొంది ఉద్యోగాలు పొందలేకపోయిన వారితో పాటు 1998 డీఎస్సీ అర్హులకు మినిమం టైం స్కేల్‌తో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చింది. 2024 డీఎస్సీలో జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు 2,217 పోస్టులు విద్యాశాఖ నోటిఫై చేసింది.

వీటికి రెసిడెన్షియల్‌, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, ఆశ్రమ స్కూల్స్‌, మున్సిపల్‌ స్కూళ్లలోని ఖాళీలు అదనంగా జతకానున్నాయి. ప్రస్తుతం నోటిఫై చేసిన పోస్టులను అవసరమైన మేరకు ఖరారు చేసి జాబితాను శనివారం రాత్రికి కమిషనర్‌ ఆఫీస్‌కి డీఈఓ ఆధ్వర్యంలో పంపనున్నారు.

నిరుద్యోగులకు ఊరట..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 2,865 ఉండగా, వీటిలో 4.57 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 12,700 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 15,298 మంది ఉపాధ్యాయులు ఉండాలి. ప్రస్తుతం 2,217 పోస్టులను నోటిఫై చేయడంతో నిరుద్యోగులకు ఊరట లభించింది.

టీడీపీ హయాంలో 608 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పోస్టులను భర్తీ చేసింది. నాలుగేళ్లలో జిల్లాలో 2018 డీఎస్సీ ద్వారా 608, 1998 డీఎస్సీ అభ్యర్థులకు 209, 2008 డీఎస్సీ అభ్యర్థులకు 204 టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చింది.

2024 డీఎస్సీ ద్వారా ఇచ్చే పోస్టులతో కలిపితే మొత్తంగా 3,238 టీచర్‌ పోస్టులను భర్తీ చేసినట్లు అవుతుంది. మొదట టెట్‌ నిర్వహించి, ఆ తరువాత డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండు నోటిఫికేషన్లు వారం రోజుల్లో రానున్నాయి.

డీఎస్పీ ద్వారా భర్తీ చేసే అవకాశం

ఎస్‌జీటీ 1,646, స్కూల్‌ అసిస్టెంట్‌

571 పోస్టులు

వీటికి అదనంగా రెసిడెన్షియల్‌,

మున్సిపల్‌, ఏపీ మోడల్‌ స్కూళ్ల

పోస్టులు పెరిగే అవకాశం

ఉమ్మడి క ర్నూలు జిల్లాలో నోటిఫై చేసిన పోస్టుల వివరాలు..

క్యాటగిరీ పోస్టులు ఖాళీల

వివరాలు

స్కూల్‌ అసిస్టెంట్‌(లాంగ్వేజ్‌–1) 84

స్కూల్‌ అసిస్టెంట్‌(లాంగ్వేజ్‌–2) 113

స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిషు 43

స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం 73

స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ 44

స్కూల్‌ అసిస్టెంట్‌ 44

బయోలాజికల్‌ సైన్స్‌

స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ 35

స్కూల్‌ అసిస్టెంట్‌ 135

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌

ఎస్‌జీటీ(తెలుగు మీడియం) 1,614

ఎస్‌జీటీ(కన్నడ మీడియం) 32

మొత్తం పోస్టులు 2,217

Published date : 06 Feb 2024 07:50AM

Photo Stories